
రైతు సంఘం నాయకులతో సమావేశమైన ఆర్డీఓ వెంకారెడ్డి
నేటి బంద్‌ను విరమించుకున్న రైతు సంఘం నేతలు
జహీరాబాద్ (జహీరాబాద్): చెరకు రైతులకు బకాయిలను చెల్లించేందుకు ట్రైడెంట్ యజమాన్యం సమ్మతించింది. బుధవారం రాత్రి ఆర్డీఓ వెంకారెడ్డి ఆధ్వర్యంలో రైతు సంఘం నాయకులు, ట్రైడెంట్ యజమాన్యంతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ట్రైడెంట్ యజమాని రామ్‌నాథ్ మాట్లాడుతూ ఈనెల 23వ తేదీ నుంచి దశలవారీగా బకాయి చెల్లిస్తానన్నారు. రూ.కోటి చొప్పున పక్షం రోజుల్లో చెల్లిస్తానని చెప్పారు. అంతేకాకుండా డిసెంబర్‌లో క్రషింగ్ సైతం చెపడతామని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు. ఇందుకు సంతృప్తి చెందిన రైతు సంఘం నాయకులు ఈనెల 23వ తేదీన నిర్వహించ తలపెట్టిన జహీరాబాద్ బంద్‌ను విరమిస్తున్నట్లు ప్రకటించారు. సమావేశంలో డీఎస్పీ రఘు, రైతు సంఘం నాయకులు కొండల్ రెడ్డి, ఢిల్లీ వసంత్, ఎంజి రాములు, జగనాథ్‌రెడ్డి, జ్యోతి, వెంకట్‌రెడ్డి, గండ్‌రెడ్డి, నాగిరెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఢిల్లీ వసంత్ మాట్లాడుతూ యాజమన్యం చెప్పినట్లుగా బకాయి చెల్లించకుంటే ఆందోళన కొనసాగుతుందన్నారు.