
సాయిలు (ఫైల్)
మెదక్: ఎక్కిళ్లు ఓ ట్రాక్టర్ డ్రైవర్‌ను బలితీసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం ఖానాపూర్(కె)లో చోటుచేసుకుంది. గ్రామనికి చెందిన నర్వ సాయిలు(39) పంచాయతీలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి భోజనం చేశాక అకస్మాత్తుగా ఎక్కిళ్లు మొదలయ్యాయి. తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ఈలోగా సాయిలు మృతిచెందాడు. ఎక్కిళ్లు రావడంతో గుండెపోటుకు గురైనట్టు 108 సిబ్బంది తెలిపారు. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
ఇవి చదవండి: శరణ్యా ఎక్కడమ్మా..? అంటూ తల్లి వేదన.. 'పొదల్లో పడేశా.. చెరువులో వేశానంటూ భర్త సమాధానం..!