తరచూ ఫోన్లో మాట్లాడుతున్న భార్య.. | - | Sakshi
Sakshi News home page

తరచూ ఫోన్లో మాట్లాడుతున్న భార్య..

Oct 12 2023 5:26 AM | Updated on Oct 12 2023 8:22 AM

- - Sakshi

శివ్వంపేట(నర్సాపూర్‌): భర్త ప్రశ్నించడంతో వివాహిత అదృశ్యమైన ఘటన శివ్వంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవికాంత్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పోతులబోగుడ గ్రామానికి చెందిన మాచవరం సుధాకర్‌కు 2013లో తూప్రాన్‌ మండలం యావపూర్‌ గ్రామానికి చెందిన కాగిత అనురాధతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఈ క్రమంలో అనురాధ సోమవారం ఫోన్‌లో మాట్లాడుతుండగా భర్త ప్రశ్నించడంతో గొడవపడింది. చిట్టి డబ్బులు కట్టడానికని ఆమె మంగళవారం ఇంట్లోంచి వెళ్లి సాయంత్రమైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో సుధాకర్‌ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. బీరువాలో ఉన్న రూ.50 వేలు కనిపించలేదని భర్త ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement