‘చలోఢిలీ’్ల పోస్టర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

‘చలోఢిలీ’్ల పోస్టర్‌ ఆవిష్కరణ

Nov 25 2026 11:05 AM | Updated on Nov 25 2026 11:05 AM

కాకరవేణి నదిలో నీటమునిగి వ్యక్తి మృతి

తాండూరు టౌన్‌: చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కేవలం నాలుగు చట్టాలను అమల్లోకి తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్మికులకు కనీస వేతనాన్ని రూ.4 వేలకు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరశిస్తూ ఢిల్లీలోని పార్లమెంటు ఎదుట జరిగే ఆందోళనకు కార్మిక లోకం తరలిరావాలని కోరుతున్నట్లు చెప్పారు. నాయకులు చంద్రయ్య, రత్నం, రఘుపతి, నరేష్‌, బలరాం, శ్రీనివాస్‌, రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

గోశాల ప్రారంభం

కొడంగల్‌: పట్టణంలోని మహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ సన్నిధిలో నూతనంగా ఏర్పా టు చేసిన గోశాలను మంగళవారం మున్సిపల్‌ చైర్మన్‌ నందారం ప్రశాంత్‌, ఆలయ ధర్మకర్తలు ప్రారంభించారు. ఈ సందర్భంగా గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోమాత సంరక్షణ, సేవ, పోషణ ఎంతో పవిత్రమైన కార్య మని నందారం ప్రశాంత్‌ అన్నారు. గోశాల శ్రీవారి ఆలయానికి అనుసంధానంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు నందారం రత్నం, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

యాలాల: కాకరవేణి నదిలో ప్రమాదవశాత్తు నీట మునిగి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని విశ్వనాథ్‌పూర్‌ సమీ పంలో మంగళవారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. విశ్వనాథ్‌పూర్‌ గ్రామానికి చెందిన మోత్కురి కిష్టప్ప(48) శివసాగర్‌ దిగువన ఉన్న కాకరవేణి నదిలో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటమునిగి మృత్యువాతపడ్డాడు. గమనించిన స్థానికులు మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువ చ్చారు. కాగా కిష్టప్ప మృతికి కాకరవేణి నదిలో ఇసుక తవ్వకాల కోసం తీసిన గుంతలే కారణమని కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌కుమార్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటేశ్‌ ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. మృతుడికి భార్య ఎల్లమ్మతో పాటు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారు. ఈ మేరకు యాలాల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement