కుప్పకూలి వృద్ధుడి మృతి | - | Sakshi
Sakshi News home page

కుప్పకూలి వృద్ధుడి మృతి

Nov 25 2026 11:05 AM | Updated on Nov 25 2026 11:05 AM

కుప్పకూలి వృద్ధుడి మృతి చేవెళ్ల: బంధువుల ఇంటికి పూజలకోసం వెళ్తున్న ఓ వృద్ధుడు మార్గమధ్యలో అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. షాబాద్‌కు చెందిన చొక్కంపేట పెంటయ్య (70)కు పిల్లలు లేరు. భార్య రెండేళ్ల కిత్రమే మృతి చెందడంతో ఒంటరిగా నివసిస్తున్నాడు. మంగళవారం చేవెళ్ల మండలం గుండాలలో బంధువుల ఇంట్లో పూజలు ఉన్నాయని వచ్చాడు. బస్‌స్టేజీ వద్దకు రాగానే అక్కడే కుప్పకూలిపోయాడు. అతడిని గుర్తించిన స్థానికులు బంధువులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించే సరికే అతడు మృతి చెంది ఉన్నాడు. పెంటయ్యకు అనారోగ్య సమస్యలు సైతం ఉన్నాయని, గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

షాబాద్‌: మండల కేంద్రంలోని పహిల్వాన్‌ చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్‌ పహిల్వాన్‌ షావలి చెరువులో మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని ఒక పురుషుడి మృతదేహం నీటిపై తేలియాడుతుండడం స్థానికులు గమనించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతుడి వయసు సుమారు 50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండొచ్చని, తెలుపు రంగు పాయింటు, తెలుపు రంగు చెక్స్‌ డిజైన్‌ కలిగిన చొక్కా ధరించి ఉన్నట్లు ఎస్‌ఐ విజయ్‌ కుమార్‌ తెలిపారు. మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచామని, ఎవరైనా గుర్తిస్తే తెలియజేయాలని కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఆటోను ఢీకొన్న

డీసీఎం

వ్యక్తి మృతి

పరిగి: ఎదురుగా వస్తున్న ఆటోను డీసీఎం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పరిగి పట్టణంలో చోటుచేసుకుంది. ఎస్సై మోహనకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరు మండల కేంద్రానికి చెందిన మహ్మద్‌ ఇర్ఫాన్‌ (30) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం రాత్రి పని నిమిత్తం పరిగికి వచ్చి తిరుగు ప్రయాణంలో పట్టణ సమీపంలో మన్నెగూడ నుంచి పరిగికి వస్తున్న డీసీఎం ఆటోనే బలంగా ఢీకొంది. ఆటోలో ఉన్న ఇర్ఫాన్‌కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement