పట్టభద్ర ఓటర్లు 40,116 | - | Sakshi
Sakshi News home page

పట్టభద్ర ఓటర్లు 40,116

Nov 25 2026 11:05 AM | Updated on Nov 25 2026 11:05 AM

వికారాబాద్‌: పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ ఇప్పటికే ముగియగా జిల్లాలో గతంతో పోలిస్తే పెద్ద సఖ్యంలో ఓట హక్కుకోసం దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన వాటిలో 2,681 మంది దరఖాస్తులు ఆన్‌లైన్‌లో తిరస్కరణకు గురయ్యాయి. ఫారం తప్పుగా నింపటం, అడిగిన వివరాలు పొందుపరచకపోవడం తదితర కారణాలతో రిజెక్టు అయినట్లు అధికారులు తెలిపారు. అయితే కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు గడువు ముగిసినా తిరస్కరణకు గురైన వారు తమ వివరాలు సమర్పించేందుకు ఇంకా సమయం ఉంది. 25నుంచి డిసెంబర్‌ 10వ తేదీ వరకు వివరాలు సరి చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లో సరైన వివరాలు అందజేస్తే తిరిగి ఓటరు హక్కు పొందే అవకాశం ఉంటుదన్నారు.

పెరిగిన దరఖాస్తులు

త్వరలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నందున ఎన్నికల సంఘం కొత్తగా ఓటరు జాబితాను తయారు చేయాలని నిర్ణయించింది. 2021 మార్చిలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణి సురభిదేవి గెలుపొందిన విషయం తెలిసిందే. త్వరలో ఆమె పదవీ కాలం ముగియనుండటంతో ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని తొమ్మిది జిల్లాల ఓటర్లు పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. అయితే మొదట్లో ఆశించిన స్థాయిలో ఓటర్లు తమ ఓటు నమోదు చేసుకునేందుకు ముందుకు రాలేదు. చివరి నిమిషంలో నమోదు కార్యక్రమం ఊపందుకుంది. గత ఎన్నికల సమయంలో జిల్లాలో మొత్తం ఓటర్లు 25,544 మంది ఉండగా ప్రస్తుతం 15వేల దరఖాస్తులు అధికంగా వచ్చాయి.

పట్టించుకోని పార్టీలు

పట్టభద్రుల ఓటరు నమోదుకు అధికారులు శ్రమిస్తుండగా ఆయా పార్టీలు పెద్దగా స్పందించడం లేదు. కీలకమైన హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటును కై వసం చేసుకునేందుకు పావులు కదుపుతూ వస్తున్న పార్టీలు ఓటరు నమోదు విషయంలో శ్రద్ధ చూపలేదనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఓటు వేయాలని ఇల్లిల్లు తిరిగే పార్టీ లు, నేతలు నమోదు నత్తనడకన సాగుతున్న పట్టించుకున్న పాపాన పోలేదు. పెద్ద మొత్తంలో దరఖాస్తులు తిరస్కరణకు గురైనా వాటిని సరిచేసే ప్రక్రియలో భాగస్వాములు కావడంలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement