ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్–14 బాస్కెట్బాల్ పోటీల్లో రంగారెడ్డి జిల్లా బాలబాలికల జట్లు విజేతగా నిలిచాయి. మూడు రోజులుగా ఖమ్మం జిల్లా కేంద్రంలో జరుగుతున్న పోటీలు సోమవారంతో ముగిశాయి. బాలుర విభాగంలో ప్రథమస్థానంలో రంగారెడ్డి నిలవగా, హైదరాబాద్, మెదక్ జట్లు రెండు, మూడో స్థానాలు దక్కించుకున్నాయి. బాలికల విభాగంలోనూ రంగారెడ్డి జట్టు టైటిల్ దక్కించుకుంది. రెండు, మూడో స్థానాల్లో ఖమ్మం, హైదరాబాద్ జట్లు నిలిచాయి. ఈ మేరకు విజేతలకు ఎంఈఓ శైలజాలక్ష్మి, జిల్లా పాఠశాలల క్రీడా సంఘం కార్యదర్శి వై.చిన్ని తదితరులు ట్రోఫీలు అందజేశారు.
బాలబాలికల విభాగాల్లో టైటిళ్లు


