పార్టీలకతీతంగా అభివృద్ధి పనులు | - | Sakshi
Sakshi News home page

పార్టీలకతీతంగా అభివృద్ధి పనులు

Nov 24 2026 11:24 AM | Updated on Nov 24 2026 11:24 AM

● ఓర్వలేకే ఎమ్మెల్యే సబితారెడ్డి విమర్శలు

● చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య

చేవెళ్ల: నియోజకవర్గంతో పాటు మున్సిపాలిటీల అభివృద్ధికి పార్టీలకతీతంగా నిధులు కేటాయిస్తూ ఎక్కడా వివక్షత లేకుండా పారదర్శకంగా ముందుకెళ్తున్నామని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆయన స్థానిక నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి చేవెళ్ల పర్యటన సందర్భంగా మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లకు నిధుల కేటాయింపులో వివక్ష చూపిస్తున్నారని చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిధుల విషయంలో ఎక్కడ వివక్షత జరిగిందో చూపించాలన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చి సబితారెడ్డిని తప్పదోవ పట్టిస్తున్నారన్నారు. ఆరోపణలు చేసే ముందు ఒక్కసారి ఆలోచన చేసి మాట్లాడాలన్నారు. నిధులు ఇవ్వకపోవటంతోనే సొంత నిధులతో సీసీరోడ్లు వేయించుకుంటున్నట్లు చెప్పిన 2వ వార్డు కౌన్సిలర్‌ వార్డులోనే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల కింద రూ.3.40 కోట్లు, నగరాభివృద్ధి కింద రూ.3.50 లక్షలు నిధులు పెట్టారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ కౌన్సిలర్లు వార్డు దామరగిద్దకు కేవలం రూ.1.65 కోట్లు మాత్రమే నిధులు కేటాయించామని ఇదేనా వివక్షత అంటే అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ వార్డులలో కూడా కాంగ్రెస్‌ వార్డులకంటే అధిక నిధులు కేటాయించామని స్పష్టం చేశారు.

తాను గెలిచిన తర్వాతే అభివృద్ధి

పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ఉన్న చేవెళ్లలో కనీస రోడ్లు కూడా లేవని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతే రోడ్లు అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. నియోజకవర్గంలో మార్కెట్‌లను తీసుకొచ్చి గోదాములు కట్టించానని చెప్పారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. 2వ వార్డు కౌన్సిలర్‌కు కేటాయించిన నిధులు రద్దు చేస్తామని, ఆధారాలు చూపించాకే నిధులు కేటాయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు దేవర వెంకట్‌రెడ్డి, మధుసూదన్‌గుప్తా, గిరిధర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, చాన్‌పాషా, జహంగీర్‌, శంకర్‌, మహేశ్‌, చెన్నయ్య తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement