ఇబ్రహీంపట్నం రూరల్: పనులు ముగించుకొని ఇంటికి తిరిగొస్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేష్ కథనం ప్రకారం.. తుర్కయంజాల్ ఏవీ నగర్‌కు చెందిన బట్టు రవి (35) డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 21న ఉదయం విధులకు వెళ్లి ముగించుకొని సాయంత్రం బైక్‌పై తుర్కయంజాల్ నుంచి నాదర్‌గుల్ వైపు వస్తుండగా ఏవీ నగర్‌లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో అదుపుతప్పి కిందపడిపోయాడు. బలమైన గాయాలు కావడంతో స్పహతప్పి పడిపోగా గమనించిన స్థానికులు అతడి జేబులోని ఆధార్‌కార్డు, గ్యాస్ బిల్లులో ఉన్న చిరునామా ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో 22న రాత్రి మృతి చెందాడు. భార్య మంగ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇసుక మాఫియాను అడ్డుకోండి
ప్రజాసంఘాల నాయకులు
తాండూరు టౌన్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న మాఫియా సభ్యుల ఆగడాలను అడ్డుకోవాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఇరిగేషన్ డీఈఈని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. యాలాల మండలం విశ్వనాథ్‌పూర్ గ్రామ పరిధిలోని శివసాగర్ ప్రాజెక్టు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారన్నారు. దీంతో భూగర్భజలాలు ఇంకిపోయి రైతన్నల పాలిట శాపంగా మారిందన్నారు. వెంటనే అక్రమార్కులపై చర్యలు తీసుకొని, జెసీబీలు, ట్రాక్టర్లను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, చంద్రయ్య, అబ్దుల్ వాహబ్, రత్నం, రఘుపతి, యాదగిరి, గౌతమ్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.


