శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి

Nov 24 2026 11:24 AM | Updated on Nov 24 2026 11:24 AM

షాబాద్‌: విద్యార్థులు చిన్నప్పటి నుంచే శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని ప్రిన్సిపాల్‌ కవిత పేర్కొన్నారు. సోమవారం షాబాద్‌ మోడల్‌ పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండలస్థాయి చెకుముకి సైన్స్‌ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్ననాటి నుంచే సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలన్నారు. వినూత్న ఆలోచనలతో సాంకేతికతను అందిపుచ్చుకొని అత్యున్నత స్థానానికి ఎదగాలన్నారు. మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని చెప్పారు. మండలస్థాయి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విభాగం నుంచి షాబాద్‌ బాలుర జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, షాబాద్‌ ప్రైవేట్‌ పాఠశాలల విభాగం నుంచి షాబాద్‌ నవజీవన్‌ పాఠశాల విద్యార్థులు జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికై న విద్యార్థులకు నిర్వాహకులు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక ఉపాధ్యక్షుడు కురుమయ్య, మండల నిర్వాహకులు శేఖర్‌గౌడ్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.

ప్రిన్సిపాల్‌ కవిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement