మొయినాబాద్: యాదవుల ఐక్యతకు సదర్ ఉత్సవాలు నిదర్శనమని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మున్సిపల్ కేంద్రంలో ఆల్ ఇండియా యాదవ మహాసభ ఆధ్వర్యంలో గురువారం రాత్రి సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గొల్ల కురుమలు పశుసంపదను పూజించి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇదే ఆనవాయితీని ఐక్యతతో కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, అంజయ్యయాదవ్, వివిధ పార్టీల నాయకులు, యాదవ మహాసభ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి: మోమిన్‌పేట మండలం వెల్‌చాల్ గ్రామానికి చెందిన మహ్మద్ అయాన్ ఈనెల 22 నుంచి 28 వరకు నేపాల్ రాజధాని ఖాట్మండ్‌లో నిర్వహించే అంతర్జాతీయ షూట్ బాల్ కప్ టోర్నీలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. తెలంగాణ నుంచి ఈ టోర్నీలో పాల్గొననున్న ఏకై క క్రీడాకారుడు కావడం గమనార్హం. ఈ సందర్భంగా గురువారం శాసనసభ స్పీకర్ ప్రసాద్‌కుమార్ తన క్యాంపు కార్యాలయంలో అయాన్‌ను సన్మానించి అభినందించారు. పోటీల్లో రాణించి ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
అనంతగిరి: వికారాబాద్‌లోని ప్రభుత్వ డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నా మని ప్రిన్సిపాల్ ఎంఏ ఘని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఈనెల 16వ తేదీ లోగా అప్లికేషన్లు సమర్పించాలని చెప్పారు. పూర్తి వివరాలకు 94914 92900 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
పరిగి: పరిగి సబ్ జైలర్‌గా శివ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న రాజ్‌కుమార్ చర్లపల్లి జైలుకు బదిలీపై వెళ్లారు. అక్కడ జైలర్‌గా విధులు నిర్వహిస్తున్న శివ పరిగికి వచ్చారు.
దోమ: మండలంలోని ఊటుపల్లికి చెందిన మంగళి తేజస్విని అండర్– 14 షాట్‌పుట్ విభాగంలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఇటీవల వరంగల్‌లో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబర్చి నేషనల్ లెవల్‌కు ఎంపికైంది. మంగళి జగన్, రాఘవేంద్రమ్మ దంపతుల కుమార్తె తేజస్విని బషీరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తున్న విద్యార్థినిని హెచ్‌ఎం శివగీత, వ్యాయామ ఉపాధ్యాయురాలు జ్యోతి, గ్రామస్తులు అభినందించారు.
‘డ్రంక్ అండ్ డ్రైవ్’.. వ్యక్తికి ట్రాఫిక్ డ్యూటీ
అనంతగిరి: మద్యం మత్తులో వాహనం నడిపిన వ్యక్తిని కోర్టులో హాజరుపర్చగా వికారాబాద్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నర్సింలు సదరు వ్యక్తికి ట్రాఫిక్ డ్యూటీ విధించారని సీఐ రఘుకుమార్ తెలిపారు. ఈమేరకు గురువారం పట్టణంలోని కూడలిలో అతను ప్లకార్డులు పట్టుకుని ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వర్తించారని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు.


