ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన

Nov 13 2026 8:39 AM | Updated on Nov 13 2026 8:39 AM

ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన

పహాడీషరీఫ్‌: జీహెచ్‌ఎంసీ జల్‌పల్లి డివిజన్‌లో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణ పనులకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. జల్‌పల్లి బిజాన్‌గుట్ట సర్వే నంబర్‌ 124లోని 6.99 ఎకరాల విస్తీర్ణంలో 11 బ్లాక్‌లు 10 అంతస్తులుగా నిర్మించనున్న టవర్స్‌ పనులకు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవితో కలిసి భూమిపూజ చేశారు. వచ్చే దీపావళి వరకు మొదటి దఫా టవర్స్‌ నిర్మించి అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి లబ్ధిదారులకు హామీ ఇచ్చారు. ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనులను పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతం, అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, ఆర్డీవో జగదీశ్వర్‌ రెడ్డి, బాలాపూర్‌ తహసీల్దార్‌ ఇందిరా దేవి, జల్‌పల్లి డీసీ బి.వెంకట్రామ్‌, డీసీసీ అధ్యక్షురాలు చిగిరింత పారిజాత, కాంగ్రెస్‌ మహేశ్వరం ఇన్‌చార్జి కేఎల్లార్‌, దేప భాస్కర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement