ఏక్యాజీ? | - | Sakshi
Sakshi News home page

ఏక్యాజీ?

Nov 4 2026 7:58 AM | Updated on Nov 4 2026 7:58 AM

ఎడాపెడా కోతలు విద్యుత్‌ కోతలు కలవర పెడుతున్నాయి. అధికారికంగా కొంతసేపు, అనధికారికంగా గంటల తరబడి కట్‌ చేస్తున్నారు. బుధవారం శ్రీ 4 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 8లోu

న్యూస్‌రీల్‌

ఉన్నతాధికారులకు నివేదించాం

ఎడాపెడా కోతలు విద్యుత్‌ కోతలు కలవర పెడుతున్నాయి. అధికారికంగా కొంతసేపు, అనధికారికంగా గంటల తరబడి కట్‌ చేస్తున్నారు.
కాలేజీ..

సాక్షి, రంగారెడ్డిజిల్లా: పలు జూనియర్‌ కళాశాలలు అడ్డదారులు తొక్కుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా అకాడమీల పేరుతో అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. గుట్టుగా తరగతులు నిర్వహిస్తు్‌ాన్నయి. వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపునకు ఇంటర్మీడియెట్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో తీరా ఆయా కాలేజీలకు అనుమతులు లేవనే విషయం తెలిసి విద్యార్థులు, వారి తల్లి దండ్రులు ఆందోళన చెందుతున్నారు. న్యాయం చేయాల్సిందిగా కోరుతూ ఇంటర్మీడియెట్‌ బోర్డును ఆశ్రయిస్తున్నారు. ఆయా కాలేజీ యాజమాన్యాలు ఇచ్చే కాసులకు కక్కుర్తిపడిన జిల్లా అధికారులు చర్యలకు వెనుకాడుతున్నారనే విమర్శలు లేకపోలేదు. విద్యార్థుల జీవితాలతో చలగాటమాడుతున్న అక్రమార్కులపై కేసులు నమోదు చేసి, అక్రమ కాలేజీలను సీజ్‌ చేయాల్సి ఉండగా.. నోటీసులతోనే సరిపెడుతుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గుర్తింపు లేని కాలేజీలకు నోటీసులు

జిల్లాలో 17 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు ఉండగా, మరో 180 ప్రైవేటు, రెసిడెన్షియల్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిలో గుర్తింపు లేని 18, ఫైర్‌ ఎన్‌ఓసీ లేనివి 12 వరకు ఉన్నట్లు తేలిసింది. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఆయా కాలేజీలకు భారీ జరిమానాలతో కూడిన షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. వాటి పేర్లను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టారు. బోర్డు నుంచి లాగిన్‌ అనుమతి సైతం ఇవ్వలేదు. అయినా అడ్మిషన్లు, తరగతులు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిలో కొన్ని యాజమాన్యాలు అనుమతులు, గుర్తింపు పొందే అశంపై లిఖిత పూర్వక హామీ ఇచ్చి, తర్వాత దాటవేత ధోరణి అవలంబిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏ ఒక్క కాలేజీపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

మచ్చుకు కొన్ని..

● ధనికభారత్‌ విద్యా సంస్థల యాజమాన్యం మన్సూరాబాద్‌లో అనుమతులు పొంది అదే కాలేజీ కోడ్‌ పేరుతో మదీనాగూడలో డేస్కాలర్‌, మాదాపూర్‌లో బోయ్స్‌ అండ్‌ గర్‌ల్స్‌ క్యాంపస్‌, బొంగుళూరులో బోయ్స్‌ క్యాంపస్‌ నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఆయా భవనాలకు ఫైర్‌ ఎన్‌ఓసీలు కూడా లేవు. జిల్లా ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారి ఇటీవల వీటికి నోటీసులు జారీ చేశారు.

● గుర్రంగూడలోని శ్రీవాగ్దేవి కాలేజీ అనుమతులు లేకుండా 111 అడ్మిషన్లు చేపట్టింది. నాలుగు నెలలుగా హాస్టల్‌ సహా ఎంపీసీ, బైపీసీ కోర్సులు నిర్వహిస్తోంది. కాలేజీపై ఫిర్యాదులు వెల్లు వెత్తడంతో జిల్లా ఇంటర్మీడియట్‌ బోర్టు అధికారి వెంక్యానాయక్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. రూ.8 లక్షల జరిమానా విధించారు. ఇక నాదర్‌గుల్‌లోని నానోకాలేజీ ఎలాంటి గుర్తింపు పొందకుండానే తరగతులు నిర్వహిస్తోంది. ఫిర్యాదులను జిల్లా ఇంటర్మీడియెట్‌ బోర్డు అధికారులు పట్టించుకోకపోవడంతో బాధితులు ప్రజావాణి వేదికగా ఇటీవల అదనపు కలెక్టర్‌ను ఆశ్రయించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన జిల్లా అధికారిపై అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి సీరియస్‌ అయ్యారు. దీంతో ఈ కాలేజీకి సైతం నోటీసులు జారీ చేశారు.

● కర్మన్‌ఘాట్‌ టీచర్స్‌ కాలేజీలోని అక్షర జూనియర్‌ కాలేజీ సహా సాగర్‌కాంప్లెక్స్‌లోని కృష్ణవేణి జూనియర్‌ కాలేజీ, హస్తినాపురంలోని నవీనా జూనియర్‌ కాలేజీ, మహర్షి జూనియర్‌ కాలేజీ, తుర్క యంజాల్‌లోని న్యూ శ్రీ చైతన్య జూనియర్‌ కాలేజీలు అనుమతి లేని భవనాల్లో కొన సాగుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో నోటీసులు జారీ చేశారు. మెజార్టీ కాలేజీల యాజమాన్యాలు నోటీసులకు స్పందించక పోవడం విశేషం.

● మూడు రోజుల పాటు రైతు మేళా

● ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దు

● రైతులకు అన్ని సదుపాయాలు కల్పించాలి

● వికారాబాద్‌ కలెక్టర్‌ దీపక్‌ తివారి

ఓ రైస్‌మిల్లులో బియ్యం పరిశీలిస్తున్న పౌరసరఫరాల శాఖ అధికారులు

అనుమతి లేకుండా అడ్మిషన్లు

గుట్టుగా ఇంటర్‌ తరగతులు, హాస్టళ్లు

విద్యార్థుల జీవితాలతో చెలగాటం

జిల్లాలో 18 కళాశాలలకు నోటీసుల జారీ

విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన

ఒకే కోడ్‌తో అనేక చోట్ల క్యాంపస్‌లు నిర్వహిస్తున్న కాలేజీలపై ఫిర్యాదులు అందాయి. వాటికి ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. మరికొన్ని ఎలాంటి అనుమతులు పొందకుండానే అడ్మిషన్లు చేపట్టి, తరగతులు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. వాటికి కూడా నోటీసులిచ్చాం. 2025–26 విద్యా సంవత్సరంలో నవంబర్‌, డిసెంబర్‌ మాసాల్లోనూ అనుమతులు ఇచ్చారు. ఈ విద్యా సంవత్సరంలోనూ అదే విధంగా అనుమతులు వచ్చే అవకాశం ఉంది. గుర్తింపు లేని కాలేజీలపై ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదించాం. వారి ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటాం.

– వెంక్యానాయక్‌, జిల్లా ఇంటర్‌బోర్డు అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement