వైద్య వృత్తి పవిత్రమైంది | - | Sakshi
Sakshi News home page

వైద్య వృత్తి పవిత్రమైంది

Nov 4 2026 7:58 AM | Updated on Nov 4 2026 7:58 AM

చేవెళ్ల: వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని.. వైద్యులను ప్రజలు దైవంతో సమానంగా చూస్తారని పట్నం మహేందర్‌రెడ్డి వైద్యకళాశాల, ఆస్పత్రి చైర్మన్‌, మండలి చీఫ్‌ విప్‌ డాక్టర్‌ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. చేవెళ్లలోని కళాశాలలో మంగళవారం అధ్యాయ్‌–2026 పేరిట నిర్వహించిన ఓరియంటేషన్‌ కార్యక్రమాన్ని వైస్‌ చైర్మన్‌ వరదారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్‌ తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్య విద్యార్థులు కృషి చేయాలని సూచించారు. బాగా చదివి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కళాశాలలో చదువుతూ ఉత్తమ ప్రతిభ కనభరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ జోయారాణి, సూపరింటెండెంట్‌ రామకృష్ణారెడ్డి, అకడమిక్‌ డైరెక్టర్‌ గౌరీ, వైస్‌ ప్రిన్సిపాల్‌ రాజేశ్వరరావు, సీనియర్‌ నాయకులు మాసన్నగారి మాణిక్యరెడ్డి, హెచ్‌ఆర్‌ విజయభాస్కర్‌రెడ్డి, ఏజీఎం రవివర్మ, నగేశ్‌, సీఓఓ అజీం, వినోద్‌రెడ్డి, కిరణ్‌, అనిల్‌, హెచ్‌ఓడీలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement