చలామనీ చేసేందుకు.. | - | Sakshi
Sakshi News home page

చలామనీ చేసేందుకు..

Nov 4 2026 7:58 AM | Updated on Nov 4 2026 7:58 AM

సుద్ద గుంతలో పడి.. గొర్రెలను శుభ్రం చేసే క్రమంలో ప్రమాదవశాత్తు సుద్ద గుంత నీటిలో మునిగి ఇద్దరు దుర్మరణం చెందారు. 8లోu

సుద్ద గుంతలో పడి.. గొర్రెలను శుభ్రం చేసే క్రమంలో ప్రమాదవశాత్తు సుద్ద గుంత నీటిలో మునిగి ఇద్దరు దుర్మరణం చెందారు.

అబ్దుల్లాపూర్‌మెట్‌: నగర శివారులో భారీ నకిలీ కరెన్సీ తయారీ ముఠా గుట్టురట్టయింది. అసలు నోట్లను పోలిన రూ.500 నోట్లను ముద్రించి మార్కెట్‌లో చలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు, షాద్‌నగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌లో నకిలీ నోట్లు తరలిస్తున్న నలుగురు నిందితులు అరెస్టయ్యారు. వారి నుంచి ఏకంగా రూ.6.78 కోట్ల విలువైన నకిలీ రూ.500 నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను మంగళవారం అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేరుల సమావేశంలో ఫ్యూచర్‌ సిటీ కమిషనర్‌ తరుణ్‌జోషి వెల్లడించారు.

పక్కా సమాచారంతో..

ఈనెల 1వ తేదీ రాత్రి విజయవాడకు ఓ ముఠా నకిలీ నోట్లను తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు ఫిల్మ్‌సిటీ ప్రధాన గేటు ఎదురుగా బాలాజీ దాబా సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వచ్చిన కారును ఆపి తనిఖీ చేయగా నకిలీ నోట్ల బాగోతం బయటపడింది. కారులోని బూడిద రంగు బ్యాగులో రూ.500 నకిలీ నోట్ల కట్టలు లభించాయి. కారులో ప్రయాణిస్తున్న మడుపోజు కర్ణాకర్‌, చిన్నోళ్ల మాణిక్య రెడ్డి, చెరుకుపల్లి రత్నాకర్‌ రెడ్డి, కరణం అజయ్‌ కుమార్‌ను అరెస్ట్‌ చేసి విచారించగా కుంట్లూర్‌లోని అద్దె ఇంట్లో నిర్వహిస్తున్న నకిలీ కరెన్సీ తయారీ కేంద్రం గురించి సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లిన పోలీసులు ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసిన ప్రింటర్లు, ల్యాప్‌టాప్‌, నోట్ల కటింగ్‌ యంత్రాలు, ఇతర సామగ్రిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు డమ్మీ పిస్టల్‌, వాకీటాకీలు, నకిలీ పోలీస్‌ గుర్తింపు కార్డులను సైతం లభించాయి. నిందితులు నకిలీ పోలీస్‌ గుర్తింపు కార్డులు, వాకీటాకీలు, డమ్మీ పిస్టల్‌ ఉపయోగించి పోలీసులుగా నటిస్తూ ప్రజలను బెదిరించి డబ్బులు దోచుకున్నట్లు విచారణలో తేలింది. ముఠాకు చెందిన మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. ముఠాతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సమావేశంలో మహేశ్వరం డీసీపీ కె.నారాయణ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, షాద్‌నగర్‌ ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ భూపాల్‌ శ్రీధర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

వివరాలు వెల్లడిస్తున్న ఫ్యూచర్‌సిటీ కమిషనర్‌ తరుణ్‌జోషి

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్ల కట్టలు

నకిలీ నోట్ల ముద్రణ

ముఠా గుట్టురట్టు

రూ.6.78 కోట్ల 500 నోట్లు స్వాధీనం

నలుగురు నిందితుల అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement