అశ్రునయనాల మధ్య లా విద్యార్థిని అంతిమయాత్ర | - | Sakshi
Sakshi News home page

అశ్రునయనాల మధ్య లా విద్యార్థిని అంతిమయాత్ర

Nov 4 2026 7:58 AM | Updated on Nov 4 2026 7:58 AM

షాద్‌నగర్‌: కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ హాస్టల్‌ గదిలో రెండురోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన షాద్‌నగర్‌ పట్టణంలోని రైతు కాలనీకి చెందిన విద్యార్థిని డాకూరి చంద్రకళ అంతిమయాత్ర మంగళవారం అశ్రునయనాల మధ్య పూర్తయింది. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ధర్మసమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్‌ మహరాజ్‌, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌, కాంగ్రెస్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకులు చంద్రకళ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మృతురాలి తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. విద్యార్థినులు సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని అన్నారు. ఆత్మహత్యలు చేసుకోవడం పరిష్కారం కాదన్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని న్యాయ విద్యను అభ్యసిస్తున్న చంద్రకళ ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆమె కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం, మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ మృతురాలి కుటుంబ సభ్యులకు రూ.25వేల ఆర్థిక సాయం అందజేశారు.

నాయకుల వాగ్వాదం

చంద్రకళ భౌతికకాయానికి నివాళి అర్పించేందుకు ధర్మసమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్‌ మహారాజ్‌ పార్టీ నాయకులతో కలిసి వచ్చారు. అదే సమయంలో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వచ్చారు. ముందుగా విశారదన్‌ మహారాజ్‌ నివాళి అర్పించేందుకు వెళ్లగా కొద్దిసేపు మందకృష్ణ మాదిగ వేచి ఉన్నారు. ఎంతకూ విశారదన్‌ మహారాజ్‌ అక్కడి నుంచి కదలకపోవడంతో ఎమ్మార్పీస్‌ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు నివాళి అర్పించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. దీంతో ఇరువర్గాల నాయకుల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది. జోక్యం చేసుకున్న పోలీసులు వారిని సముదాయించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.

భౌతిక కాయానికి పలువురి నివాళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement