ఆమనగల్లు: మండలంలోని ఆకుతోటపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 302,304లో ప్రతిపాదిత క్రషర్ ఏర్పాటుకు సంబంధించి పీసీబీ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ అప్పిలేట్ అథారిటీని ఆశ్రయించేందుకు హైకోర్టు పిటిషనర్‌కు అవకాశం కల్పించింది. గ్రామ పరిధిలో క్రషర్ ఏర్పాటుపై శ్రీపతి ఆంజనేయరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు జరగ్గా హైకోర్టు రిట్‌పిటిషన్‌ను పరిష్కరిస్తూ కాలుష్య నియంత్రణమండలి జారీ చేసిన కన్సర్ట్ ఆర్డర్స్‌పై అప్పిలేట్ అథారిటీని ఆశ్రయించేందుకు పిటిషనర్‌కు వెసులుబాటు కల్పించింది.
శంకర్‌పల్లి: జలసిరి కార్యక్రమంలో భాగంగా ప్రతి పంచాయతీలో వంద ఇంకుడుగుంతలు నిర్మించాలని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్ అన్నారు. మండలంలోని కొండకల్ గ్రామాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంకుడుగుంతల నిర్మాణానికి సంబంఽధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల పరిషత్‌లో పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డీపీఓ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ పంచాయతీల్లో ఎల్‌నినో ప్రభావం గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. భూగర్భ జలాలు పెంచుకునేందుకు ప్రతి జీపీలో 100 ఇంకుడుగుంతల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకొని, వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. సమావేశంలో ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఎంపీఓ గిరిరాజు, ఏపీఓ నాగభూషణం, ఏఈ నందకిశోర్ తదితరులు పాల్గొన్నారు.
షాబాద్: కుష్టు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే అంగవైకల్యం ఏర్పడకుండా పూర్తిగా నివారించవచ్చని రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు. మండల పరిధిలోని చందనవెల్లిలో మంగళవారం ఎల్సీడీసీ కార్యక్రమంలో భౠగంగా చేపట్టిన ఇంటింటి కుష్టు వ్యాధి గుర్తింపు సర్వేను ఆయన పరిశీలించారు. ఆరోగ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం నుంచి కుష్టు వ్యాధిని 2027 మార్చి 31 నాటికి తరిమికొట్టాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కుష్టు రహిత సమాజ నిర్మాణానికి వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలతో పాటు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ డాక్టర్ ప్రణీత్, డీపీఎంఓ లింగానాయక్, సీహెచ్‌ఓ సుందర్ నాయక్, నాగరాజు, సిబ్బంది సరళ, నవీన్, తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్‌రూరల్: మాతృభూమి పట్టణ మహిళా స్వశక్తి సమాఖ్య ఆధ్వర్యంలో ఆరోగ్యమిత్ర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు సమాఖ్య అధ్యక్షురాలు జయమ్మ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టు అనుబంధ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో (హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, నానక్‌రాంగూడ) ఔట్ సోర్సింగ్ విధానంలో నైట్ షిఫ్ట్‌లో పని చేసేందుకు ఆరోగ్యమిత్ర పోస్టుల (10) భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం, పీజీడీసీఏ అర్హత, కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలని, స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 6వ తేదీ వరకు మున్సిపల్ కార్యాలయం పని వేళల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 96400 94832 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.


