ఆరుతడి మేలు | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి మేలు

Oct 27 2026 8:22 AM | Updated on Oct 27 2026 8:22 AM

మంగళవారం శ్రీ 27 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 8లోu

న్యూస్‌రీల్‌

డివిజన్ల వారీగా..

మంగళవారం శ్రీ 27 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026
వరి బదులు..

సాక్షి, రంగారెడ్డిజిల్లా: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో యాసంగిలో రైతుల దృష్టిని వరిసాగు నుంచి ఆరుతడి పంటల వైపు మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ, విద్యుత్‌, ఉద్యానవన, గ్రామీణాభి వృద్ధిశాఖలు సంయుక్తంగా పొలం బాటపట్టాయి. ‘వరి వద్దు.. ఆరుతడి పంటలే ముద్దు’ అంటూ ఆయా విభాగాల అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఒక్కోరోజు ఒక్కో మండలంలోని వ్యవసాయ క్షేత్రాలకు చేరుకుని రైతులతో ముఖాముఖి సమావేశం అవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని నీటి వనరులు (చెరువులు, కుంటలు), ఎల్‌నినో కారణంగా అడుగంటుతున్న భూగర్భ జలాలు, ప్రస్తుతం విద్యుత్‌ డిమాండ్‌, సరఫరా సహా రైతులు పంటలను కాపాడుకునేందుకు పడుతున్న ఇబ్బందులపై చర్చిస్తున్నారు. సోమవారం మహేశ్వరం మండలం దుబ్బచర్ల రెవెన్యూ పరిధిలో జిల్లా వ్యవసాయశాఖ అధికారులు పర్యటించి, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాల్సిందిగా రైతులకు సూచించారు.

జలాల పెంపునకు ప్రణాళికలు

జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. భూగర్భజల మట్టం పెంపు కోసం వీబీజీ రామ్‌జీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో 526 పంచాయతీల పరిధిలో 1,748 పంట కుంటలు, 450 ఊటకుంటలు, 90,472 వ్యక్తిగత ఇంకుడు గుంతలు, 450 కమ్యూనిటీ ఇంకుడుగుంతలు సహా ఎండిపోయిన బోర్లు రీఛార్జింగ్‌ కోసం మరో 450 గుంతలు తవ్వించాలని నిర్ణయించారు. జూలై చివరి నాటికే 60 శాతం పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇంటికో ఇంకుడుగుంత నిర్మాణానికి రూ.6,689, కమ్యూనిటీ ఇంకుడు గుంతకు రూ.16,400, కమ్యూనిటీ ఫాంపాండ్‌కు రూ.5.80 లక్షలు, కమ్యూనిటీ/వ్యక్తిగత ఫాంపాండ్‌కు రూ.1.88 లక్షలు, కమ్యూనిటీ/ వ్యక్తిగత ఫాంపాండ్‌కు రూ.1.20 లక్షలు, ఊటకుంట నిర్మాణానికి (850 పని దినాలు) రూ.3 లక్షలు, ఊటకుంట నిర్మాణం(600 పని దినాలు) రూ.1.90 లక్షల చొప్పున కూలీ ఖర్చులు చెల్లించాలని నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో పనులు ముందుకు సాగడం లేదనే విమర్శ లేకపోలేదు.

సబ్సిడీపై డ్రిప్‌, స్ప్రింక్లర్ల పంపిణీ

తక్కువ నీటితో ఎక్కువ పంటను సాగు చేసే విధానంపై జిల్లా ఉద్యానవనశాఖ ప్రచారం చేస్తోంది. నగరవాసులకు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల సాగును ప్రోత్సహిస్తోంది. రైతులకు సబ్సిడీపై డ్రిప్‌, స్ప్రింక్లర్లను పంపిణీ చేస్తోంది. సాధారణంగా జిల్లాలో 80,612 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతుండగా, వీటిలో 31,774 ఎకరాల్లో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. 2,77,942 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తోంది. రబీ సీజన్‌లో 15,273 ఎకరాల్లో కూరగాయల పంటలను సాగు చేయాలని ఉద్యానశాఖ లక్ష్యంగా నిర్ణయించి, ఆ మేరకు రైతులకు అవగాహన కల్పిస్తోంది. దీనిలో భాగంగా 5,917 ఎకరాల్లో టమాటా, 46 ఎకరాల్లో బీన్స్‌, 587 ఎకరాల్లో బీట్‌రూట్‌, 326 ఎకరాల్లో బెండ, 194 ఎకరాల్లో కాకర, 119 ఎకరాల్లో సోరకాయ, 1,812 ఎకరాల్లో క్యారెట్‌, 366 ఎకరాల్లో వంకాయ, 213 ఎకరాల్లో క్యాబేజీ, 10 ఎకరాల్లో క్యాప్సికం, 177 ఎకరాల్లో కాలిఫ్లవర్‌, 86 ఎకరాల్లో చిక్కుడు, 96 ఎకరాల్లో కొత్తిమీర, 203 ఎకరాల్లో దోస, 347 ఎకరాల్లో గోకరకాయ, 194 ఎకరాల్లో మునగ, 380 ఎకరాల్లో పచ్చిమిర్చి, 3,607 ఎకరాల్లో ఆకుకూరల పంటలు, 95 ఎకరాల్లో దొండ, 72 ఎకరాల్లో ఉల్లి, 238 ఎకరాల్లో బీర, 182 ఎకరాల్లో పాలకూర పంటను సాగు చేయాలని నిర్ణయించింది. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటసాగును ప్రోత్సహించేందుకు స్ప్రింకర్లు, డ్రిప్స్‌పైపులను రైతులకు సబ్సిడీపై అందజేస్తోంది.

డిస్కం సీఎండీ పర్యటనలు

హెచ్చుతగ్గుల సమస్యతో పాటు సాంకేతిక లోపాల కారణంగా తరచూ విద్యుత్‌ సరఫరా నిలిచిపోంతోంది. రైతులు సబ్‌స్టేషన్లను ముట్టడిస్తుండటంతో దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ అప్రమత్తమైంది. సీఎండీ జితేష్‌ వి.పాటిల్‌ స్వయంగా రంగంలోకి దిగి పొలంబాట పట్టారు. రెండు వారాల క్రితం చేవెళ్ల మండలం ఆలూరులో పర్యటించారు. తాజాగా రెండు రోజుల క్రితం షాద్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని రాయికల్‌, విట్యాల, రామేశ్వరం గ్రామాల్లో పర్యటించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, విద్యుత్‌ సరఫరా, తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను ఆయా గ్రామాల్లోని రైతులకు వివరించే ప్రయత్నం చేశారు.

పాష, నరహరికి ఘన నివాళి

జిల్లాలో వర్షాభావ పరిస్థితులు

రంగంలోకి వ్యవసాయ, ఉద్యాన, విద్యుత్‌ శాఖలు

పొలంబాట పట్టిన అధికారులు

ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు సూచనలు

గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు

సాధారణంగా జిల్లాలో ఐదు లక్షల ఎకరాలకుపైగా పంట సాగు కావాల్సి ఉంది. ఈ ఏడాది మూడు లక్షల ఎకరాలకు మించలేదు. ఇందులో 1.30 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు.

ఇబ్రహీంపట్నం డివిజన్‌లో 1,277 ఎకరాల్లో జొన్న, 251 ఎకరాల్లో మొక్కజొన్న, 1,152 ఎకరాల్లో కంది, 14,294 ఎకరాల్లో పత్తి సహా 28,215 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇప్పటికే మెజార్టీ పంట దెబ్బతింది.

మహేశ్వరం డివిజన్‌లో 12,898 ఎకరాల్లో పంట సాగు చేశారు. వీటిలో 3,449 ఎకరాల్లో పత్తి, 50 ఎకరాల్లో జొన్న, 6,692 ఎకరాల్లో మొక్కజొన్న, 2,545 ఎకరాల్లో కూరగాయల సాగు చేశారు. పదిహేను రోజులుగా వర్షాలు లేకపోవడంతో ఇప్పటికే 1,337 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు అంచనా.

ఆమనగల్లు డివిజన్‌లో 1,15,868 ఎకరాల్లో పంటసాగైనట్లు అంచనా. వీటిలో 13,214 ఎకరాలు ఇప్పటికే వాడిపోయినట్లు సమాచారం.

చేవెళ్ల డివిజన్‌లో సాధారణంగా 1.20 లక్షల ఎకరాల్లో పంట సాగు కావాల్సి ఉండగా 80 వేల ఎకరాలకు మించలేదు. నీరు లేక ఇప్పటికే మెజార్టీ పూల తోటలు వాడిపోయాయి. తక్కువ నీటితో ఎక్కువ పంటలకు అవకాశం ఉన్న కాయగూరలు సహా పాడి, పశువుల పెంపకంపై దృష్టి సారించాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement