ఓటు హక్కును కాపాడుకుందాం | - | Sakshi
Sakshi News home page

ఓటు హక్కును కాపాడుకుందాం

Oct 27 2026 8:22 AM | Updated on Oct 27 2026 8:22 AM

మొయినాబాద్‌: ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని.. ఓటు హక్కు పరిరక్షణే దేశ పరిరక్షణ అని ఏఐసీసీ పరిశీలకుడు మోహన్‌ కుమారన్‌ మంగళం అన్నారు. ‘ఓట్‌ బచావో – దేశ్‌ బచావో’లో భాగంగా మొయినాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షురాలు చిగురింత పారిజాత, ఇతర నాయకులతో కలిసి సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని సజీవంగా ఉంచాలంటే ఓటు హక్కును కాపాడుకోవడం అవసరమన్నారు. ఎలక్షన్‌ కమిషన్‌ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మగా మారిందని.. ఎస్‌ఐఆర్‌ పేరుతో ప్రతి నియోజకవర్గంలో లక్షల మంది ఓట్లు తొలగించారని మండిపడ్డారు. దేశంలో మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ప్రజలను చైతన్యవంతం చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ ‘ఓట్‌ బచావో – దేశ్‌ బచావో’ కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు. ఇందులో భాగంగా నవంబర్‌ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు రాష్ట్రం నుంచి భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్లు చల్లా నర్సింహారెడ్డి, జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌, రఘునాథ్‌ యాదవ్‌, చేవెళ్ల, శేరిలింగంపల్లి నియోజకవర్గాల ఇన్‌చార్జులు భీమ్‌ భరత్‌, జగదీశ్వర్‌ గౌడ్‌, రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్‌ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తీగల అనితా రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్‌, రాష్ట్ర నాయకులు ఏనుగు జంగారెడ్డి, షాబాద్‌ దర్శన్‌, రాంరెడ్డి, జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాగేందర్‌ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు జ్యోతి భీమ్‌ భరత్‌, జిల్లా మైనారిటీ సెల్‌ చైర్మన్‌ ఖాజా సలావుద్దీన్‌ అమీర్‌, మొయినాబాద్‌, చేవెళ్ల మున్సిపాలిటీల చైర్‌పర్సన్‌లు సోనియాదర్శన్‌, సమత వెంకట్‌ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు మాణయ్య తదితరులు పాల్గొన్నారు.

ఏఐసీసీ పరిశీలకుడు మోహన్‌ కుమారన్‌ మంగళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement