ఠాణాల కోసం భవనాల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఠాణాల కోసం భవనాల పరిశీలన

Oct 27 2026 8:22 AM | Updated on Oct 27 2026 8:22 AM

మొయినాబాద్‌/మొయినాబాద్‌రూరల్‌: మొయినాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేయనున్న అజీజ్‌నగర్‌ పోలీస్‌ష్టేషన్‌, మొయినాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌, మొయినాబాద్‌ డివిజన్‌ ఏసీపీ కార్యాలయం ఏర్పాటుకోసం ఫ్యూచర్‌ సిటీ కమిషనర్‌ తరుణ్‌ జోషి పలు భవనాలను పరిశీలించారు. సోమవారం అజీజ్‌నగర్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌ భవనం, పీహెచ్‌సీ, అంగన్‌వాడీ భవనం, నాగిరెడ్డిగూడలో పంచాయతీ కార్యాలయం, హిమాయత్‌నగర్‌లోని వార్డు కార్యాలయాన్ని అజీజ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటుకోసం పరిశీలించారు. మండల తహసీల్దార్‌ కార్యాలయం వెనకాల ఉన్న సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టల్‌ భవనాన్ని, చిలుకూరు మహిళా ప్రాంగణంలోని భవనాలను ఏసీపీ కార్యాలయం, ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్లకోసం పరిశీలించారు. వీటిలో మౌలిక సదుపాయాలు, ప్రజలకు అందుబాటులో ఉండే భవనాలు, అనుకూలమైన అంశాలను సమీక్షించారు. ఆయన వెంట చేవెళ్ల డీసీపీ యోగేష్‌గౌతమ్‌, ట్రాఫిక్‌ డీసీపీ శివం ఉపాధ్యాయ, చేవెళ్ల ఏసీపీ కిషన్‌, మొయినాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ మల్లికార్జున్‌రెడ్డి, ఎస్‌ఐలు వెంకన్న తదితరులు ఉన్నారు.

క్రికెట్‌ మైదానాల పరిశీలన

ఆల్‌ ఇండియా పోలీస్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహణ కోసం పలు క్రికెట్‌ మైదానాలను ఫ్యూచర్‌సిటీ కమిషనర్‌ తరుణ్‌ జోషి పరిశీలించారు. మొయినాబాద్‌లోని క్రికెట్‌ గ్రౌండ్‌లను పరిశీలించి టోర్నమెంట్‌లో భాగంగా రాష్ట్రాల వారీగా నిర్వహించే మ్యాచ్‌లు, క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. ఆయన వెంట స్పోర్ట్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఐజీపీ గజరావు భూపాల్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement