వాల్మీకి బోధనలు మార్గదర్శకం | - | Sakshi
Sakshi News home page

వాల్మీకి బోధనలు మార్గదర్శకం

Oct 27 2026 8:22 AM | Updated on Oct 27 2026 8:22 AM

వాల్మీకి బోధనలు మార్గదర్శకం

ఇబ్రహీంపట్నం రూరల్‌: మహర్షి వాల్మీకి బోధనలు సమాజానికి మార్గదర్శకం అని అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ కె.కిరణ్మయి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. మహర్షి వాల్మీకి జీవితం, ఆయన రచనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. వాల్మీకి బోధించిన విలువలను ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ, సమాజంలో ఐక్యత సోదరభావం, నైతిక విలువలను పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి కేశురాం, వాల్మీకి సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇర్విన్‌ రిజర్వాయర్‌ రద్దు చేయాలి

ఆమనగల్లు: మాడ్గుల మండలం ఇర్విన్‌ గ్రామంలో డిండి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులో భాగంగా నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్‌ను రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో ఇర్విన్‌ నుంచి రైతులు, ప్రజలు ర్యాలీగా తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అక్కడే వంటావార్పు చేసుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. డిండి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కోసం ఇర్విన్‌లో రిజర్వాయర్‌ నిర్మాణం చేపడితే దాదాపు 1,200 ఎకరాల భూమిని కోల్పోతామని, చిన్న, సన్నకారు రైతులు నష్టపోతారని అన్నారు. నల్లగొండ జిల్లా కోసం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా రైతులకు అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. వెంటనే రిజర్వాయర్‌ నిర్మాణాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీల్దార్‌ వినయ్‌సాగర్‌కు వినతిపత్రం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement