ఇబ్రహీంపట్నం రూరల్: గ్రామకంఠం భూమిని స్వాధీనం చేసుకొని ప్రజలకు పంచాలని డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ డిమాండ్ చేశారు. గ్రామకంఠం భూమి కబ్జాకు గురైందని, కాపాడాలని కోరుతూ మండలంలోని దండుమైలారం గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కార్యక్రమానికి డాక్టర్ విశారదన్ మహారాజ్ సంఘీభావం తెలిపి మాట్లాడారు. దండుమైలారంలో ఓ భూస్వామి ఆక్రమించిన 4.20 ఎకరాల భూమిని కబ్జా నుంచి విడిపించాలని అన్నారు. పంచాయతీ రికార్డులు తారుమారు చేయడంపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. 32 రోజులుగా ఆందోళనలు చేపడుతుంటే స్పందించకపోవడం సిగ్గు చేటన్నారు. గ్రామానికి చెందిన మరి కొందరు ఆరు ఎకరాల గ్రామకంఠం భూమి అక్రమించారని వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఎసీ నాయకులు పాల్గొన్నారు.
డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్


