వివాదానికి దారితీసిన ప్రహరీ కూల్చివేత | - | Sakshi
Sakshi News home page

వివాదానికి దారితీసిన ప్రహరీ కూల్చివేత

Oct 27 2026 8:22 AM | Updated on Oct 27 2026 8:22 AM

తుర్కయంజాల్‌: అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం మన్నెగూడ రెవెన్యూ సర్వే నంబర్‌ 40, 41లోని భూమిలో ప్రహరీ కూల్చివేత వివాదానికి దారితీసింది. ఇరువర్గాల వారు సోమవారం అక్కడికి చేరుకోవడం ఉద్రిక్తతకు కారణమైంది. దీనిపై ప్రముఖ్‌ టౌన్‌షిప్‌ కాలనీ వాసులతో పాటు, జీవీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ నిర్వాహకులు ఒకరిపై మరొకరు ఆదిభట్ల పోలీసులకు ఫిర్యా దు చేసుకున్నారు. విచారణ అనంతరం చర్య లు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

గంజాయి పట్టివేత

అబ్దుల్లాపూర్‌మెట్‌ : గంజాయి విక్రయించేందుకు యత్నిస్తున్న ఇద్దరిని అదపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 168 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల కేంద్రంలోని బాలాజీ దాబా వద్ద విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండడాన్ని గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారు హయత్‌నగర్‌ శారదానగర్‌కు చెందిన మణికంఠ, అబ్దుల్లాపూర్‌మెట్‌ బీసీకాలనీకి చెందిన ప్రతాప్‌గా తేలింది. వారి నుంచి 168 గ్రాముల గంజాయితో పాటు రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు.

బైక్‌ దొంగకు రిమాండ్‌

యాచారం: బైక్‌ దొంగను యాచారం పోలీసులు సోమవారం రిమాండ్‌కు తరలించారు. వివరాలివీ.. నల్లగొండ జిల్లా డిండి మండలం ఖానాపూర్‌ గ్రామానికి చెందిన కె.నవీన్‌ నగరంలోని సరూర్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. జల్సాల కోసం పలు చోట్ల బైక్‌ల దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఆదివారం మాల్‌ మార్కెట్‌లో ఒక బైక్‌ను దొంగతనం చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారించగా గతంలో సరూర్‌నగర్‌, నాగోల్‌ తదితర పోలీస్‌స్టేషన్ల పరిధిలో పలు బైక్‌లను చోరీ చేయగా ఆరు కేసులు నమోదైనట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన యాచారం పోలీసులు సోమవారం నవీన్‌ను రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement