హయత్‌నగర్: హయత్‌నగర్‌లోని వస్పరి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన రెండు కోర్టులు శనివారం ప్రారంభమవుతాయని బార్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మౌషుమీ భట్టాచార్య, నర్సింగ్‌రావు నందికొండ ముఖ్యఅతిథులుగా హాజరవుతారన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.కర్ణకుమార్, న్యాయాధికారులు ప్రియాంక సిరిసిల్ల, ఫరీన్‌బేగం, జిల్లా మెట్రోపాలిటన్ సెషన్స్ వినోద్‌కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. హయత్‌నగర్‌లో కొనసాగుతున్న 7వ, 14వ మెట్రోపాలిటన్ కోర్టులతో పాటు నూతనంగా ఏర్పాటు చేసిన 20వ, 21వ మెట్రో పాలిటన్ కోర్టులు శనివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి.
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా చైర్మన్ మహేశ్వర్‌రెడ్డి
చేవెళ్ల: ఈ నెల 27న యాదగిరిగుట్టలో నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తొమ్మిదవ వార్షికోత్సవ సభను విజయవంతం చేయాలని సంఘం ఉమ్మడి జిల్లా చైర్మన్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి యాలాల మహేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉద్యమకారుల హక్కులు, ఆత్మగౌరవం, సంక్షేమం కోసం ఐక్యంగా ముందుకు సాగుతూ, ఫోరం లక్ష్యాలను బలోపేతం చేయాలని కోరారు. ఈ సభ ద్వారా ఉద్యమకారుల హక్కులను కాపాడుకోవటంతోపాటు సామాజిక, ప్రజాస్వామిక, తెలంగాణ పుననిర్మాణంపై చర్చిస్తామన్నారు.
యాచారం: మండల పరిధిలోని చింతపట్ల జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు జిల్లా స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని గురుకుల విద్యాపీట్‌లో గురువారం నిర్వహించిన జోనల్ లెవెల్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్‌లో పాఠశాలకు చెందిన విద్యార్థులు అండర్–14, అండర్–17 విభాగాల్లో ఏడు మంది చొప్పున 14 మంది ఉత్తమ ప్రతిభ చూపడంతో జిల్లాస్థాయికి ఎంపిక చేశారు. దీంతో శుక్రవారం విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు కృష్ణ, చంద్రశేఖర్, సురేశ్ అభినందించారు.
వికారాబాద్ జెడ్పీ సీఈఓ సుధీర్
బంట్వారం: అధికారులు, ప్రజాప్రనిధులు కలి సి పని చేసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని జెడ్పీ సీఈఓ సుధీర్ అన్నారు. శుక్రవారం ఎంపీడీఓ రాములు అధ్యక్షతన మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయా శాఖల అధికారులు ఎజెండా లోని అంశాలను, ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. మహిళా సమాఖ్యకు సంబంధించి గ్రామ పంచాయతీలకు ఎలాంటి సమాచా రం అందడం లేదని బంట్వారం, యాచారం సర్పంచ్‌లు మల్లేశం, జ్యోతిరెడ్డి సభ దృష్టికి తెచ్చారు. స్పందించిన జెడ్పీ సీఈఓ సర్పంచ్‌లకు తప్పని సరిగా సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. మండల కేంద్రానికి మంజూరైన పసుపు యూనిట్ పనులు ఏ దశలో ఉన్నాయ ని సర్పంచ్ మల్లేశం ప్రశించారు. డీఆర్‌డీఓ నుంచి అనుమతులు రాగానే ప్రారంభిస్తామని ఏపీఎం వివరణ ఇచ్చారు. మార్కెట్ యార్డు నిర్మాణానికి గ్రామ కంఠంలో ఎకరం భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని బంట్వారం సర్పంచ్ తెలిపారు. అందుకు ఏఎంసీ చైర్మన్ మహేందర్‌రెడ్డి సుముఖత వ్యక్తం చేశారు. మద్వాపూర్–బుగ్గాపూర్ వరకు పీఆర్ రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ గోరేమియ అధికారులను కోరారు. విద్యుత్ సమ స్యపై తొర్మామిడి, సల్బత్తాపూర్ సర్పంచ్‌లు సంజీవయ్య, బాలయ్య ట్రాన్స్‌కో ఏఈని నిలదీశారు. వీలైనంత త్వరలో సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మర్పల్లి ఏఎంసీ చైర్మన్ మహేందర్‌రె డ్డి, హార్టికల్చర్ ఆఫీసర్ కమల పాల్గొన్నారు.


