మంత్రి శ్రీధర్‌బాబుకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి వినతి
షాబాద్: రేడియల్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి కోరారు. శుక్రవారం ఆయన బాధిత రైతులతో కలిసి మంత్రి శ్రీధర్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంకేపల్లిగూడ భూ సేకరణలో కొలతలు, సరిహద్దుల విషయంలో సందిగ్ధతను తొలగించేందుకు రీసర్వే చేపట్టాలని మంత్రిని కోరారు. భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం జరిగేలా తగు చర్యలు తీసుకోవాలని మంత్రికి విన్నవించారు. స్పందించిన మంత్రి మాట్లాడుతూ.. రైతుల సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, సర్పంచ్‌లు లావణ్య చెన్నయ్య, నవనీత, మంగమ్మ, కాంగ్రెస్ నాయకులు, తదితరులున్నారు.


