ధారూరు: ఎద్దు పొడిచిన ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. ఎస్‌ఐ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మోమిన్‌ఖుర్దు గ్రామానికి చెందిన బంటు శ్రీనివాస్(42) ఈ నెల 6న అదే గ్రామానికి చెందిన మల్లికార్జునరెడ్డి పొలం దున్నడానికి వెళ్లాడు. మధ్యాహ్నం భోజనం చేసేందుకు వెళుతూ కాడి నుంచి ఎద్దులను విప్పి కట్టేయడానికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఓ ఎద్దు బెదిరి బలంగా పొడిచి ఎత్తేసింది. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ను పొలం యజమాని మల్లికార్జునరెడ్డి వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందాడు. మృతుని భార్య సుగుణమ్మ ఫిర్యాదు మేరకు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


