మొయినాబాద్‌రూరల్:మండల పరిధిలోని ఎత్‌మార్‌పల్లి గ్రామ సమీపంలో కొనసాగుతున్న వికారాబాద్ మహిళా డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ విజయకోట మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో ఖాళీగా ఉన్న డీఎల్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్‌కు పార్ట్‌టైమ్‌లో పని చేసేందుకు పీజీ పూర్తి చేసిన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నెట్, సెట్ ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఈ నెల 20న 10 గంటలకు సర్టిఫికెట్లతో హాజరుకోవాలని కోరారు.
సంచార పశువైద్యశాల
అంబులెన్స్ తనిఖీ
కందుకూరు: సంచార పశువైద్యశాల అంబులెన్స్ (1962)ను మంగళవారం కందుకూరులో అంబులెన్స్ జిల్లా నిర్వహణ అధికారి శ్రీహరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్‌లో ఉన్న వైద్య పరికరాలు, మందులు, రికార్డులతో పాటు సిబ్బంది పని తీరును పరిశీలించారు. అత్యవసర సమయాల్లో సిబ్బంది పశువులకు అందించే చికిత్స విధానాన్ని పరిశీలించారు. పశువులకు వైద్యం అవసరమైనప్పుడు వెంటనే స్పందించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో అంబులెన్స్ సిబ్బంది సాయికిరణ్, యాదయ్య, వెంకటేశ్ పాల్గొన్నారు.
భక్తులకు ఇబ్బంది
రానీయొద్దు
తుర్కయంజాల్: గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తుర్కయంజాల్‌లోని మాసబ్ చెరువు వద్ద భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోనున్నట్లు డీసీపీ ట్రాఫి క్, ఐసీఎస్ రాహుల్ హెగ్డే తెలిపారు. మాసబ్ చెరువు, సాగర్ రహదారిని మంగళవారం ఆయన పరిశీలించారు. ఉత్సవాల సమయంలో నిమజ్జనం వేళ వాహనాల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్, క్రౌడ్ మేనేజ్‌మెంట్, పార్కింగ్ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, బారికేడ్ల ఏర్పాటు వంటి అంఽశాలపై కింది స్థాయి అధికారులతో చర్చించారు. అన్ని శాఖల సమ న్వయంతో పనులు చేపట్టాలని సూచించారు.
బాలల సంరక్షణ సంస్థలో ఆకస్మిక తనిఖీ
ఇబ్రహీంపట్నం రూరల్: బాలల వసతి గృహాల్లో అకృత్యాలు, అసాంఘీక కార్యకలాపాలు జరిగితే సహించేది లేదని జిల్లా సంక్షేమ అధికారి శాంతిశ్రీ అన్నారు. చైతన్యపురిలోని ఆ దర్శ ఫౌండేషన్ ఫర్ బాయ్స్ బాలల సంరక్షణ సంస్థను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలల యోగ క్షేమాలు అడిగి తెలు సు కున్నారు. సంస్థకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. పిల్లలకు అందిస్తున్న ఆహారం పోషక విలువలతో కూడి ఉందో లేదో ఆరా తీ శారు.పిల్లలు నివసించే గదులు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించా రు. లైసెన్స్ లేకుండా నడిపితే వసతిగృహ య జమానులపై కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. కార్యక్రమంలో బాలల సంరక్షణ సంస్థ ఇన్‌చార్జి దేవేంద్రచారి ఉన్నారు.
ఉద్యోగులకు న్యాయం
జరిగేలా చూడండి
మాడ్గుల: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును సేవ్ టీచర్స్ సంఘం నాయకులు కోరా రు. ఈ మేరకు హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌తో కలిసి సేవ్ టీచర్స్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బొడ్డు రవి, రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల మధుకర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా జీఓ నంబర్ 317 అమలులో జరిగిన అవకతవకలపై విద్యాశాఖ నుంచి సమగ్ర నివే దిక తెప్పించి, నష్టపోయిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.


