ప్రజా సమస్యలపై పోరాడుతాం | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలపై పోరాడుతాం

Aug 19 2026 9:04 AM | Updated on Aug 19 2026 9:04 AM

● సీపీఐ జాతీయ సమితి సభ్యుడు జంగయ్య

మొయినాబాద్‌: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడతామని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పాలమాకుల జంగయ్య అన్నారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న జిల్లా ప్రజా చైతన్య యాత్ర మంగళవారం మొయినాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు, యువకులు, విద్యార్థులు, కార్మికులు, పేదలు కేంద్ర ప్రభుత్వ విధానాలతో తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రాష్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వాల విధానాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై ఉద్యమాలను విస్తృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవీంద్రచారి, మండల కార్యదర్శి కె.శ్రీనివాస్‌, నాయకులు నర్సింగ్‌రావు, రామస్వామి, పర్వతాలు, జంగయ్య, యాదయ్య, ప్రభులింగం, సత్యనారాయణ, యాదగిరి, శివకుమార్‌, శ్రీదేవి, దత్తునాయక్‌, కాంత్రి, వంశివర్ధన్‌రెడ్డి, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement