న్యూస్‌రీల్
పహాడీషరీఫ్: నగర యువకుడి చేతిలో బిహార్‌కు చెందిన యువతి దారుణ హత్యకు గురైంది. బాలాపూర్ ఠాణా పరిధిలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ఎం.సుధాకర్ తెలిపిన ప్రకారం.. పాట్నాకు చెందిన రెహానా (21) తల్లిదండ్రులతో కలిసి వలస వచ్చి కాటేదాన్ ఒరంగడ్డలో నివాసం ఉంటూ ఫంక్షన్ హాళ్లలో వెయిటర్‌గా పని చేసేది. ఈ క్రమంలోనే ఫంక్షన్ హాళ్లకు ఫిల్టర్ వాటర్ సరఫరా చేసే షాహిన్‌నగర్ బిస్మిల్లా కాలనీకి చెందిన షేక్ అహ్మద్ (21)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. విషయం తెలిసిన రెహానా తల్లిదండ్రు లు పలుమార్లు ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశా రు. కానీ తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకుంటామని ఇరువురూ తెగేసి చెప్పడంతో రెహానా తండ్రి ఇషాక్ ఆరు నెలల క్రితమే ఆమెను వదిలేసి, కుటుంబంతో స్వస్థలానికి వెళ్లిపోయారు. అనంతరం నాలుగు నెలల పాటు ప్రేమికులిద్దరూ రహస్యంగా కలిసి ఉన్నట్లు స మాచారం. రెండు నెలలు క్రితం రెహానాను తన ఇంటికి తీసుకెళ్లిన అహ్మద్ ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని కొద్దిరోజులుగా యువతి ఒత్తిడి చేస్తోంది. ఆదివారం అర్ధరాత్రి కూడా ఇదే విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఆగ్రహానికి గురైన అహ్మద్ కత్తితో రెహానా వీపు భాగంలో విచక్షణా రహితంగా పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం తన తల్లి ఆయేషా తో కలిసి మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి, మాయం చేసేందుకు పరిచయస్తుల సాయం కోరాడు. ఇలా విషయం బయటకు రావడంతో స్థానికులు తెల్లవారుజామున 4 గంటలకు డయల్ 100కు ఫోన్ చేసి, సమాచారం అందించా రు. ఇన్‌స్పెక్టర్ సుధాకర్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. బెడ్‌రూంలో మూటకట్టి పెట్టిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, క్లూస్ టీమ్‌తో ఆధారాలు, బ్లడ్ శాంపిళ్లను సేకరించారు. అనంత రం శంషాబాద్ జోన్ డీసీపీ బి.రాజేశ్, ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్ కుమార్‌రెడ్డి కూడా ఘటనా స్థలాని కి చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించారు. పెళ్లి చేసుకోవాలన్నందుకే హత్య చేశాడా..? ఫంక్షన్ హాళ్లలో పనిచేసే రెహానా విధుల్లో భాగంగా ఇతరులతో మాట్లాడుతోందనే అనుమానంతో అఘాయిత్యానికి పాల్పడ్డాడా..? అనే కోణంలో పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి బాబాయి కొడుకు అక్తర్ ఫిర్యాదు మేరకు బాడీని ఉస్మానియాకు తరలించి, పోస్టుమార్టం అనంతరం వారికి అప్పగించారు. పరారీలో ఉన్న తల్లీకొడుకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతురాలు గర్భందాల్చినట్లు వైద్యులు నిర్ధారించారు.
కత్తితో పొడిచి.. గోనెసంచిలో కుక్కి
షాహిన్‌నగర్‌లో బిహార్ యువతి దారుణ హత్య
రెండు నెలలుగా హంతకుడితో సహజీవనం చేస్తున్న మృతురాలు
పెళ్లికి బలవంతం చేస్తోందని అంతమొందించిన ప్రియుడు


