నిర్లక్ష్యం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం చేయొద్దు

Jul 25 2026 7:21 AM | Updated on Jul 25 2026 7:21 AM

నిర్లక్ష్యం చేయొద్దు

ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది ఓటు. ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకునే అత్యంత కీలకమైన ప్రక్రియ ఎన్నికలు. అలాంటి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలంటే అర్హుడైన ప్రతి పౌరుడు తన పేరును ఓటరు జాబితాలో ఉండేలా చూసుకోవాలి. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణలో భాగంగా కొత్త ఓటర్లను నమోదు చేయడమే కాకుండా, ఓటరు జాబితాను కచ్చితమైందిగా, పారదర్శకమైందిగా, తప్పులు లేనిదిగా రూపొందించడం కూడా ముఖ్యం. మరో పది రోజుల్లో గడువు ముగియబోతోంది. ప్రతి ఒక్కరూ తమ ఎన్యూమరేషన్‌ ఫారాలను పూర్తి చేసి సంబంధిత బీఎల్‌వోకు అందజేయాలి. నిర్దేశించిన గడువులోగా ఫారాలు సమర్పించని పక్షంలో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సంబంధిత ఓటరు జాబితా నుంచి పేరు తొలగించే ప్రమాదం ఉంది. ఒక్కసారి పేరు తొలగిస్తే, తరువాత మళ్లీ నమోదు చేసుకోవడానికి అదనపు ప్రక్రియ అనుసరించాల్సి రావచ్చు. అప్పటివరకు జరిగే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడొచ్చు. విలువైన హక్కును నిర్లక్ష్యం చేయొద్దు. ఎన్యూమరేషన్‌ ఫారం వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాదు, కుటుంబ బాధ్యత కూడా. ప్రతి ఒక్కరూ స్పందిస్తేనే జిల్లాలో వందశాతం లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమవుతుంది.

– నారాయణరెడ్డి, కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement