స్కూల్‌ బస్సు కిందపడి చిన్నారి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌ బస్సు కిందపడి చిన్నారి దుర్మరణం

Jul 25 2026 7:21 AM | Updated on Jul 25 2026 7:21 AM

స్కూల్‌ బస్సు కిందపడి చిన్నారి దుర్మరణం

కొందుర్గు: స్కూల్‌ బస్సు కిందపడి ఓ చిన్నారి మృతిచెందిన ఘటన జిల్లేడ్‌చౌదరిగూడ మండలం కాస్లాబాద్‌లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మనీష, కృష్ణయ్య దంపతుల కూతురు సహస్ర(4) చౌదరిగూడలోని అభ్యాస్‌ విద్యాపీఠంలో యూకేజీ చదువుతోంది. శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు చిన్నారిని స్కూల్‌ బస్సులో పాఠశాలకు పంపించి, పనులకు వెళ్లారు. సాయంత్రం కాస్లాబాద్‌కు చేరుకున్న బస్సులో నుంచి అందరితోపాటు సహస్ర కిందికి దిగింది. బస్సును రివర్స్‌ తీసే క్రమంలో చక్రాల కింద పడిపోయింది. గమనించిన స్థానికులు షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. డ్రైవర్‌ నిర్లక్ష్యంతోనే సహస్ర చనిపోయిందని స్థానికులు తెలిపారు. కాగా, డ్రైవర్‌కు లైసెన్స్‌ లేదని, బస్సుకు ఫిట్‌నెస్‌ లేదని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement