న్యూస్‌రీల్
కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే అసలైన బలం ప్రతీఒటరు వివరాలను నమోదు చేయించాలి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో ‘సర్’పై సమీక్ష
గురువారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2026
కొడంగల్/దుద్యాల/బొంరాస్‌పేట: స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఈప్రాంతానికి అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. గత పాలకులు వివక్షతోనే కొడంగల్ అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తన నివాసం వద్ద నిర్వహించిన సర్ నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. పదవులు, నిధులు, సంక్షేమం తదితర అన్ని అంశాల్లో కొడంగల్ వెనకబడింది. నన్ను గెలిపించిన మీకోసం నిత్యం 18గంటలు పనిచేస్తున్నా.. ఇప్పుడు అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది.. చేసుకుందాం అన్నారు.
ఓటు లేకపోతే శవంతో సమానం
ఓటు లేని పౌరుడు శవంతో సమానం. సుశిక్షితులైన కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి అసలైన బలం. ఓటరు నమోదు కార్యక్రమంలో ప్రతీ పేదవాడికి అండగా నిలవాలి. ఇంటింటికీ, గల్లీగల్లీకి తిరిగి ప్రక్రియను పూర్తిచేయాలి. మనకు వచ్చే ఓట్లను తొలగించే కుట్రలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాల పప్పులు ఉడకనీయొద్దు.
ఓటర్ నమోదు ఇలా..
కొడంగల్‌లో నియోజకవర్గంలో మొత్తం 2,51,255 మంది ఓటర్లున్నారు. వీరిలో ఇప్పటి వరకు 1,96, 620 మంది మాత్రమే సర్ పత్రాలు సమర్పించారు. మిగిలిన 54,635 మంది ఫారాలు ఇవ్వలేదు. 78 శాతం నమోదు పూర్తయింది. కోస్గి మండలంలో 9,864 మంది, కొడంగల్‌లో 8,260, మద్దూరులో 8,421,దుద్యాలలో 5,460,గుండుమాల్‌లో 4,070, కొత్తపల్లిలో 3,630, దౌల్తాబాద్‌లో 9,300, బొంరాస్‌పేటలో 5,930 మంది ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వాల్సి ఉందని ముఖ్యమంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దీపక్‌తివారి, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్‌గుప్తా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి, తహసీల్దార్ రాంబాబు, ఏఎంసీ చైర్మన్ అంబయ్యగౌడ్, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, మున్సిపల్ మాజీ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసూఫ్, డీసీసీ అధ్యక్షు డు ధారాసింగ్, మండల అధ్యక్షులు నర్సింలుగౌడ్, ఆవుటి శేఖర్, కౌన్సిలర్ కృష్ణంరాజు, నాయకులు నయీమ్, వెంకట్రాములుగౌడ్ పాల్గొన్నారు.
నెమ్మదిగా సాగుతున్నాయనే..
హకీంపేట్ శివారులో చేపట్టిన ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయనే సమాచారం తెలుసుకున్న ముఖ్యమంత్రి దుద్యాల పర్యటనకు నిర్ణయించుకున్నారు. మంగళవారం రాత్రి 11గంటల వరకూ ఇక్కడే ఉండి పనులను పరిశీలించడంతో పాటు సీఎం హోదాలో సుమారు ఐదు గంటల పాటు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. పనులు సకాలంలో పూర్తిచేయాలని లేదంటే చర్యలు తప్పవని అధికారులు, కాంట్రాక్టర్లను హెచ్చరించారు. తాగునీరు, సాగునీరుతో పాటు రోడ్లు, పంచాయతీ భవనాలు నిర్మించి ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బందోబస్తు కోసం వచ్చిన పోలీసులు వర్షంతో ఇబ్బంది పడ్డారు.
సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి
గత పాలకుల వివక్షతోనేఅన్నిఅంశాల్లో వెనకబడ్డాం


