పహాడీషరీఫ్: యువకుడు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. మంఖాల్ గ్రామానికి చెందిన యాదయ్య కుమారుడు బాకీ కార్తీక్(23) డీఆర్‌డీఎల్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. రోజు మాదిరిగానే ఈ నెల 10వ తేదీన ఉదయం ఇంటి నుంచి వెళ్లాడు. కార్తీక్ డ్యూటీకి రాలేదని సహోద్యోగి శ్రీరాములు అతని తల్లి అరుణమ్మకు సమాచారం ఇచ్చాడు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఫోన్‌లో సంప్రదించగా స్విచ్ఛాప్ వచ్చింది. సాధ్యమైన ప్రాంతాలలో వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లో గాని 87126 62367 నంబర్‌లోనైనా సమాచారం ఇవ్వాలని తెలిపారు.
– డ్రంక్ డ్రైవింగ్‌పై ట్రాఫిక్ పోలీసుల నజర్
సాక్షి, సిటీబ్యూరో: నరగంలో రోడ్డు ప్రమాదాలను నిరోధించడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా శుక్ర, శనివారాల్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 478 మందిని వాహనచోదకుల్ని పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో అత్యధికంగా ద్విచక్ర వాహనచోదకులు 398 మంది, ఆటోడ్రైవర్లు 42 మంది, తేలికపాటి వాహనాలు డ్రైవర్లు 38 మంది ఉన్నారు. బీఏసీ లెవల్స్ వారిగా చూస్తే 30–50 మధ్య 97 మందికి, 51–100 మధ్య 197 మందికి, 101–159 మధ్య 92 మందికి, 151–200 మధ్య 54 మందికి, 201–250 మధ్య 20 మందికి, 251–300 మధ్య నలుగురికి, 300 కంటే ఎక్కువ 14 మందికి వచ్చినట్లు ట్రాఫిక్ చీఫ్ డి.జోయల్ డెవిస్ ఆదివారం తెలిపారు.


