బహదూర్‌గూడ రైతుల రాస్తారోకో | - | Sakshi
Sakshi News home page

బహదూర్‌గూడ రైతుల రాస్తారోకో

Jul 12 2026 6:52 AM | Updated on Jul 12 2026 6:52 AM

శంషాబాద్‌: బుల్లెట్‌ ట్రైన్‌ సర్వే పేరిట ప్రభుత్వాధికారులు రైతులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని బహదూర్‌గూడ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఉదయం ఫెన్సింగ్‌, మార్కింగ్‌ వేయడానికి వచ్చిన ప్రభుత్వ వాహనాన్ని స్థానిక రైతులు తిప్పిపంపారు. సెత్వార్‌ ప్రకారం సర్వే : 1 – 101 వరకు మొత్తం 1350 ఎకారల భూమిలో ప్రభుత్వ భూమి ఎక్కడా లేదన్నారు. ప్రస్తుత రికార్డులో 76 నర్వే తర్వాత మొత్తం నంబర్లు ఎందకు మాయమయ్యాయని ప్రశ్నించారు. ఏళ్లుగా తాము లేవనెత్తుతున్న ఈ ప్రశ్నకు ఇప్పటి వరకు ఏ అధికారీ స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదన్నారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న సర్వే : 28లో 150 ఎకరాలు, సర్వే: 62లో 500ఎకరాలు సర్కారు భూమిగా పేర్కొంటూ తమను బజారుకు ఈడ్చేందుకు చూస్తోందన్నారు. ప్రభుత్వం తమకు పట్టాలివ్వాలనేదే తమ డిమాండ్‌ అన్నారు.

శంషాబాద్‌ రూరల్‌: రైతులకు నోటీసులు కూడా ఇవ్వకుండా అన్యాయంగా భూములు లాక్కోడానికి అధికారులు దౌర్జన్యం చేస్తున్నారంటూ బహదూర్‌గూడ వాసులు శనివారం ఆందోళనకు దిగారు. బహదూర్‌గూడ ప్రాంతంలో బుల్లెట్‌ ట్రైన్‌ హబ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం చేపట్టిన భూసేకరణను వ్యతిరేకిస్తూ.. బహదూర్‌గూడ–లక్ష్మీతండా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. పోలీసులు వారిన అడ్డగించి అక్కడి నుంచి పంపించగా.. పక్కనే టెంట్‌వేసి శాంతియుత వాతావరణంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలంటూ నినాదాలు చేశారు. తమ తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న రైతులకు పట్టా పాసుపుస్తకాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. హబ్‌ ఏర్పాటులో భాగంగా ఇటీవల ఆ పొలాల్లో సర్వే చేసి కొన్ని హద్దులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు శనివారం ఉదయం హైడ్రా సిబ్బంది ఈ భూముల చుట్టూ ఫెన్సింగ్‌ వేసేందుకు, గుంతలు తీసేందుకు యంత్రాలతో అక్కడి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని వారిని అడ్డుకున్నారు. రికార్డులను తారుమారు చేసి రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోబ పట్టిస్తున్నారని ఆరోపించారు.

భయబ్రాంతులకు గురిచేస్తున్నారు..

సరిహద్దుల ఏర్పాటు పనుల అడ్డగింపు

పాసు పుస్తకాలు ఇవ్వాలంటూ ఆందోళన

బహదూర్‌గూడ–లక్ష్మీతండా రోడ్డుపై బైఠాయింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement