లక్డీకాపూల్: సోమాజిగూడ, బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌ల్లో శనివారం ప్రత్యేక ఎస్‌ఐఆర్(సర్) హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. సులభమైన, పౌర–స్నేహపూర్వక అనుభవాన్ని అందించడానికి ఓటరు సహాయ కౌంటర్లు, అవసరమైన ఫారాలను అందుబాటులో ఉంచారు. ఓటర్ల గణన ఫారాలను నింపడం, ఓటరు వివరాలను ధ్రువీకరించడం, సందేహాలను నివృత్తి చేయడంలో సహాయపడటానికి శిక్షణ పొందిన సిబ్బంది అందుబాటులో ఉన్నారు. ఓటరుకు సర్ ప్రక్రియను మరింత అందుబాటులోకి, పారదర్శకంగా, సౌకర్యవంతంగా మార్చడమే ఈ హెల్ప్‌డెస్క్‌ల లక్ష్యం.


