‘గాంధీ’లో నకిలీ ఉద్యోగ ప్రకటనలు | - | Sakshi
Sakshi News home page

‘గాంధీ’లో నకిలీ ఉద్యోగ ప్రకటనలు

Jul 12 2026 6:52 AM | Updated on Jul 12 2026 6:52 AM

‘గాంధీ’లో నకిలీ ఉద్యోగ ప్రకటనలు

గాంధీఆస్పత్రి: సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో నకిలీ ఉద్యోగ ప్రకటనలు నమ్మి మోసపోవద్దని సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ వాణి తెలిపారు. గాంధీ హాస్పిటల్‌ హైదరాబాద్‌ జాబ్స్‌–2006 పేరిట వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా తదితర సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఉద్యోగ ప్రకటనలు వెలువడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రి, మెడికల్‌ కాలేజీల్లో రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ కేటగిరీల్లో ఎటువంటి ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్‌ జరగడంలేదని ఆమె స్పష్టం చేశారు. జాబ్‌ డాట్‌ సర్కారీలక్ష్య డాట్‌ కామ్‌ లింక్‌ ద్వారా తక్షణమే ఆన్‌లైన్‌లో అప్‌లై చేసుకోవాలని మోసగాళ్లు సూచిస్తూ అందినకాడికి దండుకుంటున్నారని ఆరోపించారు. ఆకర్షణీయమైన వేతనం, ప్రకటన క్రింద వెరిఫైడ్‌ స్టాంప్‌ ఉండడంతో ఉద్యోగార్థులు, నిరుద్యోగులు మోసపోతున్నారని తెలిపారు. వీటిపై సైబర్‌ సెల్‌కు ఫిర్యాదు చేశామన్నారు.

నమ్మొద్దని కోరిన సూపరింటెండెంట్‌ వాణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement