మొయినాబాద్‌రూరల్: అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లలు, గర్భిణులు, మహిళలకు పౌష్టికాహారం సక్రమంగా అందించాలని, ఆరోగ్య కేంద్రంలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. మండల పరిధిలోని కనకమామిడి పంచాయతీ ఆవరణలో ఉన్న ఆరోగ్య ఉపకేంద్రాన్ని, అంగన్‌వాడీ కేంద్రాన్ని సోమవారం సందర్శించారు. అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్లు, ఆయాలకు పలు సూచనలు చేశారు. ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షించాలని తెలిపారు. ఆయా కేంద్రాల్లో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక జాబితా సమగ్ర సవరణలో పొరపాట్లకు తావివ్వొద్దని బీఎల్‌వోలకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ గౌత మ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, ఆర్‌ఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
సర్ ప్రక్రియలో పొరపాట్లు జరగొద్దు
మొయినాబాద్: సర్ ప్రక్రియలో ఎలాంటి పొర పాట్లు జరగకుండా అధికారులు జాగ్రత్త పడా లని కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. మున్సి పల్ పరిధిలోని ఎన్కెపల్లిలో సోమవారం ఆయన పర్యటించారు. బీఎల్‌ఓలు పంపిణీ చేస్తున్న ఎస్‌ఐఆర్ ఫారం, వాటిని నింపడం, డిజిటలైజేషన్, ఇంటికి వెళ్లే సమయంలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్ ప్రక్రియలో ఏదైనా సమస్య ఎదురైతే ముందుగా ఉన్నతాధికారుల దృష్టికి తేవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, తహసీల్దార్ గౌతమ్, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కొత్తూరు: మండల పరిధిలోని సిద్ధాపూర్, కొత్తూరు పట్టణంలో కొనసాగుతున్న ప్రీప్రైమరీ తరగతులను సోమవారం జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి జయచంద్రారెడ్డి ఎంఈవో వెంకట్‌రాంరెడ్డితో కలిసి పరిశీలించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధిస్తు న్న తీరుతో పాటు సౌకర్యాలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. తరగతుల నిర్వ హణ తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సాక్షి, సిటీబ్యూరో: హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలు జరుగుతున్నట్టు వచ్చిన ఫిర్యాదులను హైడ్రా సీరియస్‌గా తీసుకుంది. ఇరిగేషన్ శాఖ ఫిర్యాదును పరిగణలోకి తీసు కున్న కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, హైదరా బాద్ కలెక్టర్ ప్రియాంక అలాతో కలిసి పరిశీలించారు. తమ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపట్టారని ఇరిగేషన్ అధికారులు చెప్పడంతో ఈ అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్షించింది. ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ చేపట్టిన భవన నిర్మాణానికి అనుమతులు లేవని ఇరిగేషన్ శాఖ స్పష్టం చేసింది. ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ అనంతరం సంబంధిత రికార్డులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారుల బృందం వెల్లడించింది.
ఉప్పల్: ఉప్పల్‌లోని న్యూ గోల్డెన్ ఫుడ్స్ (ఉస్మానియా బిస్కెట్ల తయారీ యూనిట్)లో సోమవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనేక లోపాలను గుర్తించారు. తనిఖీల అనంతరం యూనిట్‌కు 58 స్కోరు మాత్రమే ఇచ్చిన అధికారులు.. మెరుగుదల చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తయారీ ప్రాంతంలో తగినంత వెలుతురు లేకపోవడం, అపరిశుభ్రత, పనుల పర్యవేక్షణకు ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించారు. కీటకాలు లోపలికి ప్రవేశించకుండా ఇన్‌సెక్ట్ ప్రూఫ్ మెష్‌లు లేకపోవడం, యూనిట్ అంతటా ఈగలు సంచరిస్తుండడంతో ఆహార పదార్థాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. పెస్ట్ కంట్రోల్ రికార్డులు నిర్వహించకపోవడం, కార్మికులు వ్యక్తిగత పరిశుభ్రత నిబంధనలను పాటించక పోవడం, ముడి పదార్థాలను సరైన విధంగా నిల్వ చేయకపోవడం వంటి లోపాలను గుర్తించారు. ప్యాకేజింగ్ ప్రక్రియ ప్రమాణాలకు అనుగుణంగా లేదని నివేదికలో పేర్కొన్నారు.


