రైతులను ఇబ్బంది పెట్టొద్దు | - | Sakshi
Sakshi News home page

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

Jul 7 2026 6:52 AM | Updated on Jul 7 2026 6:52 AM

షాబాద్‌: ఎరువుల విషయంలో రైతులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. మండలంలో సోమవారం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. నాగరగూడలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తమది రైతు ప్రభుత్వమని, రైతు భరోసా నిధులు ఇచ్చి వారి కళ్లలో సంతోషం చూస్తున్నామని చెప్పారు. ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే సహించేది లేదని, ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి, సర్ధార్‌నగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పీసరి సురేందర్‌రెడ్డి, గుడిమల్కాపూర్‌ మారెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కావలి చంద్రశేఖర్‌, సర్పంచులు అశోక్‌, సబిత, స్వరూప, లావన్య, యాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పట్టణ ప్రగతికి పెద్దపీట

చేవెళ్ల: పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మండలం, మున్సిపాలిటీ పరిధిలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టణాల్లో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన, రహదారుల అభివృద్ధి, సుందరీకరణ పనులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, పరిశ్రమల స్థాపనతో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దేవర సమతారెడ్డి, సర్పంచ్‌లు లావణ్యరాజేశఖర్‌, శ్రీనివాస్‌, అనురాధ అశోక్‌, కౌన్సిలర్లు, పీఏసీఎస్‌ చైర్మన్‌లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం

శంకర్‌పల్లి: మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. మున్సిపల్‌ పరిధిలో సోమవారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ సాత ప్రవీణ్‌ కుమార్‌, టీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్‌ చల్లా నర్సింహారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ గోవిందమ్మ, మున్సిపల్‌ కమిషనర్‌ యోగేశ్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ శ్వేతపాండురంగారెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

మంత్రి శ్రీధర్‌బాబు

షాబాద్‌, చేవెళ్ల, శంకర్‌పల్లి మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement