మ్యాన్‌హోల్‌ కుంగి.. ప్రమాదకరంగా మారి | - | Sakshi
Sakshi News home page

మ్యాన్‌హోల్‌ కుంగి.. ప్రమాదకరంగా మారి

Jun 9 2026 9:04 AM | Updated on Jun 9 2026 9:04 AM

జిల్లెలగూడ స్వాగత్‌ గ్రాండ్‌ నుంచి నందనవనం వెళ్లే ప్రధాన రహదారిపై మ్యాన్‌హోల్‌ కుంగి ప్రమాదకరంగా మారింది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే రోడ్డుపై మ్యాన్‌హోల్‌ కుంగిపోయి, దగ్గరకు వచ్చేవరకు కనిపించకుండా ఉండడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదం బారినపడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇంజినీరింగ్‌ విభాగం వారు మూతను ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని రోజుల్లోనే యథాస్థితికి చేరుకుందని తెలిపారు. తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా సమస్యను పరిష్కరించాలని వాహనదారులు, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

–మీర్‌పేట

Advertisement
 
Advertisement
Advertisement