నాటుబాంబు కొరికి జింక మృతి
కడ్తాల్: గుర్తు తెలియని వ్యక్తులు అడవి పందు ల కోసం పెట్టిన నాటుబాంబు పేలి జింక మృతి చెందిన సంఘటన చరికొండ పంచాయతీ పరిధిలోని బోయిన్‌గుట్టతండా సమీప అటవీ ప్రాంతంలో శనివారం వెలుగుచూసింది. ఫారెస్ట్ అధికారుల వివరాల ప్రకారం.. అటవీ ప్రాంతంలోని వ్యవసాయ పొలాల వద్ద అడవి పందుల కోసం పెట్టిన నాటు బాంబు(పూస)ను కొరకడంతో ఓ జింక తీవ్రంగా గాయపడి, చనిపోయింది. శనివారం మధ్యాహ్నం పొలం పనులకు వెళ్లిన రైతులకు దుర్వాసన రావడంతో వెళ్లి చూడగా జింక కళేబరం కనిపించింది. అటవీ అధికారులకు సమాచారం అందించడంతో సెక్షన్ అఫీసర్ మహ్మద్ హుస్సేన్ అక్కడికి చేరుకుని, పశువైద్యాధికారి డాక్టర్ భానునాయక్ ఆధ్వర్యంలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. నాటుబాంబు పేలడంతోనే జింక నోటిభాగం దవడలు పగిలి, తీవ్ర రక్త స్రావంతో మృతి చెందినట్లు నిర్ధారించారు.
భూ తగాదాల్లో
ఎనిమిది మందికి రిమాండ్
పూడూరు: భూ తగాదాల నేపథ్యంలో కర్రలతో దాడికి పాల్పడిన ఘటన చన్గోముల్ ఠాణా పరిధిలో జరిగింది. కంకల్ గ్రామానికి చెందిన పట్లోళ్ల నవీన్‌రెడ్డి తన సోదరులతో కలిసి శుక్రవారం పొలం పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన చింతకింది యాదయ్య, శ్రీకాంత్, శ్రీనివాస్ వచ్చి పొలం తమదంటూ గొడవకు దిగారు. మాటామాటా పెరిగి వారు నవీన్‌రెడ్డి సోదరు లు దామోదర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, యాదవరెడ్డిపై దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎనిమిది మందిని రిమాండ్‌కు తరలించారు.


