వార్డుల విభజనలో అన్యాయం
చేవెళ్ల: మున్సిపాలిటీ ఏర్పాటులో భాగంగా చేసిన వార్డుల విభజనలో మల్కాపూర్‌కు అన్యాయం చేశారని ఎంపీటీసీ మాజీ సభ్యుడు బక్కరెడ్డి రవీందర్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు పలువురు గ్రామస్తులు, నాయకులతో కలిసి శనివారం మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. మల్కాపూర్ గ్రామాన్ని మున్సిపాలిటీలో కలిపిన అధికారులు వార్డుల విభజనలో అన్యాయం చేశారన్నారు. గ్రామాన్ని రెండు వార్డులు (4, 12)గా విభజించారని, ఇది సక్రమంగా జరగలేదని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా చేసిన, అసంబద్ధ విభజనను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని గ్రామాల్లో వార్డులు సీరియల్‌గా ఉండగా, తమ గ్రామానికి సంబంధించిన వార్డులను మాత్రం 4, 12గా విభజించడం ఏమిటని ప్రశ్నించారు.


