సావిత్రీబాయి సేవలు చిరస్మరణీయం
ఇబ్రహీంపట్నం రూరల్: విద్యార్థులకు విద్యాబోధనతో పాటు సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. సావిత్రీబాయి పూలే జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంఘ సంస్కర్తగా సావిత్రిబాయి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. విద్య అజ్ఞానాన్ని దూరం చేస్తుందని తెలియజేస్తూ బాలికా విద్యను ప్రోత్సహించారని, మహిళల హక్కుల కోసం తనవంతు కృషి చేశారని తెలిపారు. మహనీయులను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ వారి ఆశయ సాధన దిశగా అడుగులు వేయాలని సూచించారు. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన బోధన అందించి ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. అనంతరం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 13 మంది ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సావిత్రీబాయి పూలే జయంతి వేడుకలను శనివారం షాద్‌నగర్‌లో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఉన్న పూలే దంపతుల విగ్రహాలకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
– షాద్‌నగర్
కలెక్టర్ నారాయణరెడ్డి
సావిత్రీబాయి సేవలు చిరస్మరణీయం


