
పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం
వర్షాలకు కూలిన ఇళ్లు
వెంగళరావునగర్: నగరంలోని కాలనీలు, బస్తీలు నిరంతరం పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ పేర్కొన్నారు. యూసుఫ్‌గూడ సర్కిల్–19 పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కర్ణన్ మాట్లాడుతూ.. పరిశుభ్రత, ప్రజారోగ్యం.. ఈ రెండూ విడదీయరాని అంశాలని, పరిశుభ్రతతోనే వ్యాధులు దూరమవుతాయని చెప్పారు. ఆరోగ్యకర నగర నిర్మాణమే లక్ష్యంగా మాన్సూన్ శానిటేషన్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్టు పేర్కొన్నారు. నగర ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో క్రియాశీలక భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. వానలు తగ్గుముఖం పట్టినందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూసేందుకు నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని కర్ణన్ సూచించారు. అనంతరం సర్కిల్ పరిధిలోని జీహెచ్‌ఎంసీ కార్యాలయం, జానకమ్మతోట, రహమత్‌నగర్, ఎస్‌సీఆర్ హిల్స్, బోరబండ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో సమీక్షించారు. కర్ణన్ వెంట శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ బోర్ఖడే హేమంత్ సహదేవ్‌రావు, హెల్త్ అండ్ శానిటేషన్ అదనపు కమిషనర్ సి.ఎన్.రఘుప్రసాద్, సర్కిల్–19 ఉప కమిషనర్ రజినీకాంత్‌రెడ్డి, ఏసీపీ ప్రసీద, డీఈఈ భద్రు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
మండపాలకు
అనుమతులు తప్పనిసరి
ఎస్‌ఐ యాదగిరి
దుద్యాల్: గణపతి మండపాలకు పోలీసుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్‌ఐ యాదగిరి పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 27న వినాయక చవితి పురస్కరించుకుని మండలంలోని ప్రతీ గ్రామంలో వినాయకుల ప్రతిమలను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. అందుకుగాను మండల వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న వినాయక మండపాలకు నిర్వాహకులు అనుమతులు తీసుకోవాలన్నారు. దీనికోసం రాష్ట్ర పోలీస్ శాఖ ఒక ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించిందన్నారు. ఈ వెబ్ సైట్‌లో మండపాలకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేస్తే అనుమతి లభిస్తుందని తెలిపారు. ఈ అనుమతి ఉంటేనే అవసరమైన సమయంలో పోలీస్ బందోబస్త్ ఏర్పాటుకు అవకాశం ఉంటుందని ఆయన సూచించారు.
రామంతాపూర్ విషాదంపై లోకాయుక్త స్పందన
సుమోటోగా కేసు నమోదు, నోటీసులు జారీ
సాక్షి, సిటీబ్యూరో: రామంతాపూర్‌లోని గోఖలేనగర్‌లో కృష్ణాష్ణమి సందర్భంగా శుక్రవారం నిర్వహించిన కృష్ణుడి శోభాయాత్రలో చోటు చేసుకున్న విద్యుత్ షాక్ విషాదంపై లోకాయుక్త స్పందించింది. విద్యుత్ షాక్‌తో ఐదుగురు చనిపోవడంపై సుమోటోగా కేసు నమోదు చేశారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా మేడ్చల్ కలెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్, టీజీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ, ఉప్పల్ ఇన్‌స్పెక్టర్లకు బుధవారం నోటీసులు జారీ చేశారు.
చేవెళ్ల: భారీ వర్షాల కారణంగా మండలంలోని ఆలూరు గ్రామంలో ఓ పాత ఇల్లు కూలింది. గ్రామానికి చెందిన షాబాద్ పెంటయ్యది మట్టిగోడలతో పెట్టిన ఇల్లు కావటంతో వర్షాలకు బాగా తడిసి మంగళవారం రాత్రి ఒక్కసారిగా కూలింది. పాత ఇల్లు కావటంతో పాటు వర్షాల కారణంగా ఇళ్లు తడిసిపోయిందని బాధితుడు పెంటయ్య పక్కనే వేరే ఇంట్లో ఉంటున్నట్లు తెలిపాడు. ఇంట్లో ఎవరు లేకపోవటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపాడు. తమను ఆదుకోవాలని కోరుతున్నాడు.
సర్ధార్‌నగర్‌లో..
షాబాద్: గత మూడురోజులుగా కురుస్తున్న వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బుధవారం మండల పరిధిలోని సర్ధార్‌నగర్ గ్రామానికి చెందిన కాసమోని వెంకటేశ్ ఇల్లు భారీ వర్షాలకు కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని కోరారు.

పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం

పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం