
మహ్మద్‌నగర్‌వాసికి జాతీయ అవార్డు
కందుకూరు: భారత్‌కే అన్మోల్ 2025 ఢిల్లీ ఎడిషన్ జాతీయ అవార్డును మండల పరిధిలోని మహ్మద్‌నగర్‌కు చెందిన సినీ నిర్మాత (స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ) ఎండీ ఆసిఫ్‌జానీ అందుకున్నారు. కానిస్ట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నషా ముఖ్త్ భారత్–మాదకద్రవ్యరహిత భారతదేశం ఒక మైలురాయి అన్న అంశంపై సోమవారం రాత్రి ఢిల్లీలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియా క్రికెట్ మాజీ కెప్టెన్ అజహరుద్దీన్, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. మాదకద్ర వ్యాల నివారణపై అవగాహన కల్పిస్తున్నందుకు ఈ అవార్డు వరించింది.
వృక్షశాస్త్రంలో గోల్డ్ మెడల్
కడ్తాల్: మండల కేంద్రానికి చెందిన శ్రీవాణి వృక్ష శాస్త్రంలో గోల్డ్‌మెడల్ సాధించింది. ఉస్మానియా యూనివర్సిటీలో 2022–24 విద్యా సంవత్సరంలో ఆమె బోటనీ సబ్జెక్ట్‌గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా మంగళవారం వర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్ర మంలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ చేతుల మీదుగా గోల్డ్‌మెడల్ అందుకుంది. శ్రీవాణి గోల్డ్ మెడల్ సాధించడంపై గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, పలువురు నాయకులు అభినందించారు.
కూరగాయల సాగుపై రైతులకు అవగాహన
యాచారం: మండల పరిధిలోని చౌదర్‌పల్లిలో మంగళవారం కూరగాయల పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ, కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు కూరగాయల సాగుపై అవగాహన కల్పించారు. ఏ సీజన్‌లో ఏవి సాగు చేయాలి, మార్కెట్‌కు తరలింపు, విత్తనాలు, నార్ల ఎంపిక తదితర విషయాలపై అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారి బసవన్నప్ప వివరించారు. ఆధునిక పద్ధతుల్లో కూరగాయల పంటలు సాగు చేస్తే అధిక దిగుబడితో మంచి లాభాలు వస్తామని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ అధికారి సురేష్ తెలిపారు. సమావేశంలో మండల వ్యవసాయాధికారి రవినాథ్, రుక్మిణి, రాధ తదితరులు పాల్గొన్నారు.
నానో యూరియాతో
అధిక దిగుబడులు
షాద్‌నగర్: రైతులు నానో యూరియాను వాడి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందొచ్చని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. పట్టణంలోని పరిగి రోడ్డులో ఉన్న మన గ్రోమోర్ ఎరువుల గోదామును మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాములో ఎరువుల నిల్వలు, వాటికి సంబంధించిన రికార్డులు, ఈపాస్ యంత్రాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు అపోహలు నమ్మొద్దని సూచించారు. కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు రమాదేవి, మండల వ్యవసాయ అధికారి నిషాంత్‌కుమార్, ఏఓ టెక్నికల్ శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

మహ్మద్‌నగర్‌వాసికి జాతీయ అవార్డు

మహ్మద్‌నగర్‌వాసికి జాతీయ అవార్డు

మహ్మద్‌నగర్‌వాసికి జాతీయ అవార్డు