
కనెక్షన్లు.. కలెక్షన్లపై
న్యూస్‌రీల్
బస్తీ పర్యటనలతో గుట్టు రట్టు
సోమవారం శ్రీ 18 శ్రీ ఆగస్టు శ్రీ 2025
డిస్కంలో ఇంటిదొంగలు!
నజర్
కాంట్రాక్టర్లుగా ఆర్టిజన్లు
గ్రేటర్‌లో పది సర్కిళ్లు ఉండగా, మూడు (మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్) జోన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 30 ఆపరేషన్ డివిజన్లు ఉండగా, 220 వరకు ఆపరేషన్ సెక్షన్లు పని చేస్తున్నాయి. 213 మంది ఆపరేషన్ ఏఈలు 12 వేల మందికిపైగా జేఎల్‌ఎంలు, ఆర్టిజన్లు పని చేస్తున్నారు. ఇతర విభాగాల్లోని ఉద్యోగులతో పోలిస్తే వీరి వేతనాలు కూడా ఎక్కువే. క్షేత్రస్థాయిలోని కొంత మంది ఏఈలు, జేఎల్‌ఎంలు, ఆర్టిజన్లు గుట్టుగా కాంట్రాక్టర్ల అవతారం ఎత్తుతున్నారు. బిల్డర్లతో కుమ్మకై ్క డిస్కం ఆదాయానికి పెద్ద మొత్తంలో గండి కొడుతున్నారు. ముఖ్యంగా అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లోని నిర్మాణాలకు కొత్త కనెక్షన్లు జారీ చేసే విషయంలో భారీ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. స్థానిక సంస్థల నుంచి ఎలాంటి అనుమతులు లేని భవనాలకు, అసైన్డ్/ప్రభుత్వ/ భూదాన్ భూముల్లో వెలుస్తున్న భారీ నిర్మాణాలకు గుట్టుగా కనెక్షన్లు జారీ చేస్తున్నారు. కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసే సమయంలో వినియోగదారుని ఫోన్ నంబర్ కాకుండా ఇతర నంబర్లు నమోదు చేయిస్తున్నారు. నెలవారీ బిల్లుల సమాచారం మాత్రమే కాదు సరఫరాలో హెచ్చుతగ్గుల సమస్య, లైన్ల పునరుద్ధరణ కోసం తీసుకుంటున్న ఎల్సీల వంటి సమాచారం వారికి చేరడం లేదు. అంతేకాదు మూడు నుంచి ఐదు కిలోవాట్ల డిమాండ్ ఉన్న వారికి కేవలం కిలోవాట్ కనెక్షన్ జారీ చేస్తున్నారు. తర్వాత లో ఓల్టేజీ సమస్య తలెత్తుతుండగా ఓల్టేజీ పెంపు పేరుతో సంస్థ నిధులను కొల్లగొడుతున్నారు.
సాక్షి, రంగారెడ్డిజిల్లా: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని పలువురు ఇంజనీర్లు బిల్డర్లతో దోస్తీ చేస్తూ అనధికారిక భవనాలకు తక్కువ లోడుతో కనెక్షన్లు మంజూరు చేస్తున్నారు. ఆ తర్వాత లో ఓల్టేజీని సాకుగా చూపించి సంస్థ నిధులతో డెవలప్‌మెంట్ పనులు చేయిస్తున్నారు. ప్రత్యక్షంగా వినియోగదారుల జేబును గుల్ల చేస్తుండడంతో పాటు సంస్థ అంతర్గత నష్టాలకు కారణమవుతున్నారు. వినియోగదారుని పేరున నమోదు కావాల్సిన ఎల్‌టీఎం అగ్రిమెంట్లు ఒకే వ్యక్తి నంబర్‌పై 843 వెలుగు చూశాయి. కాంట్రాక్టర్ల పేరునే కాదు ఏకంగా ఓ లైన్‌మెన్ నంబర్‌పై 140 ఎల్‌టీఎం అగ్రిమెంట్లు డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ పరిశీలనలో తేలాయి. సంస్థ నుంచి నెలవారీ వేతనాలు తీసుకుంటూ పరోక్షంగా నష్టాలకు కారణమవుతున్న ఇంజనీర్లు, ఆర్టిజన్ కార్మికులపై సీఎండీ సీరియస్ అయినట్లు తెలిసింది. ఇటీవల అసిస్టెంట్ ఇంజనీర్లతో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లోనూ ఇదే అంశంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం.
బిల్డర్లతో కుమ్మక్కు.. తక్కువ లోడుతో కనెక్షన్లు జారీ
కాంట్రాక్టర్ల అవతారం ఎత్తుతున్న ఆర్టిజన్లు
బస్తీ పర్యటనల్లో పలు లోపాల గుర్తింపు
సంస్థ నష్టాలకు కారణమవుతున్న ఇంజనీర్లపై వేటుకు రంగం సిద్ధం
విద్యుత్ లైన్లు, తరచూ సాంకేతిక లోపాలకు కారణమవుతున్న అంశాలను గుర్తించేందుకు ఇటీవల ఇంజనీర్లు బస్తీబాట పట్టారు. డైరెక్టర్లు సహా సీఎండీ వరకు ఇలా ఉన్నతాధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ క్రమంలో అక్రమాలను గుర్తించినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం ఏఈలతో సీఎండీ నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లోనూ ఇదే అంశంపై చర్చ జరిగినట్లు తెలిసింది. కొంత మంది ఏఈలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. డిస్కం నుంచి నెలవారీ వేతనాలు తీసుకుంటూ గుట్టుగా కాంట్రాక్టర్ అవతారం ఎత్తిన క్షేత్రస్థాయి ఏఈలు, జేఎల్‌ఎంలు, ఆర్టిజన్లపై కూడా దృష్టిసారించినట్లు తెలిసింది. ప్రజావసరాల కోసం డిస్కం స్టోర్ల నుంచి డ్రా చేసిన మెటీరియల్‌ను ప్రైవేటు అపార్ట్‌మెంట్లు/ సంస్థలకు తరలించిన వారిని సైతం గుర్తించి వారిపై శాఖాపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.