
హెల్పర్ బోర్డు ఏర్పాటు చేయాలి
ఇబ్రహీంపట్నం: హమాలీ కార్మికులకు హెల్పర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.వీరయ్య డిమాండ్ చేశారు. రైస్ మిల్లు హమాలీ కార్మికుల సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఒకటవ మహాసభను స్థానిక పాషనరహరి స్మారక కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికుల మాదిరిగా హమాలీ కార్మికులకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. రైస్ మిల్లు యాజమాన్యాలు కార్మికులకు సంవత్సరానికి రూ.7 వేల బోనస్, ప్రమాద బీమా రూ.15 లక్షలు ఇవ్వాలన్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని, రెండేళ్లకు ఒకసారి ఆగ్రిమెంట్ రూపంలో కూలీ రేట్లు పెంచాలని కోరారు. అనంతరం హమాలీ కార్మికుల మహాసభ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎల్లేశ్, ప్రధాన కార్యదర్శిగా దుర్గయ్య, కోశాధికారిగా జంగయ్య, ఉపాధ్యక్షులుగా జంగయ్య, వెంకటేశ్, సహాయ కార్యదర్శులుగా శ్రీశైలం, రామ్‌రెడ్డి, జంగయ్య, ఆర్గనైజర్‌గా బుగ్గరాములు, పండిత్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యోలమోని స్వప్న, మున్సిపల్ కన్వీనర్ ఎల్లేశ్ పాల్గొన్నారు.