
లక్ష గాంధీ విగ్రహాల ప్రదర్శన పోస్టర్ ఆవిష్కరణ
ఆమనగల్లు: హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో అక్టోబర్‌లో నిర్వహించే లక్ష గాంధీ విగ్రహాల ప్రదర్శన, మహాత్మాగాంధీ సుస్థిర మహావిజ్ఞాన సదస్సు పోస్టర్‌ను ఆదివారం పట్టణంలో లయన్స్‌క్లబ్ ఉపాధ్యక్షుడు పాపిశెట్టి రాము ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంట్లో గాంధీ భావజాలం ఉన్నట్లయితే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ సాహితీ అధ్యక్షుడు గోపాల్‌జీ, లక్ష గాంధీ విగ్రహాల ప్రదర్శన కమిటీ కో కన్వీనర్ శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
షాబాద్: ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని ఆచార్య సోమశేఖర్, ఆచార్య గణపతి, ఆచార్య కేతన్ మహాజన్ పేర్కొన్నారు. మండల పరిధిలోని బోనగిరిపల్లి వద్ద ఉన్న మహర్షివేద గురుకులంలో ఆదివారం ఉపనయన సంస్కారం కార్యక్రమం నిర్వహించారు. యజ్ఞ హోమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కొంత సమయం దేవుడికి కేటాయించాలని సూచించారు. దేవాలయాలవద్దకు వెళ్లినప్పుడు నిష్టతో పూజలు చేయాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
షాద్‌నగర్‌రూరల్: శ్రీకృష్ణ భగవానుడు బోధించిన భగవద్గీత సారాంశాన్ని ఆచరిస్తే మోక్షం లభిస్తుందని త్రైత సిద్ధాంతం ప్రభోద సేవా సమితి–ఇందూ జ్ఞాన వేదిక నగర కమిటీ అధ్యక్షురాలు సద్గుణ అన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని త్రైతసిద్ధాంతం ప్రభోద సేవా సమితి– ఇందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పట్టణంలోని క్రిష్టియన్ కాలనీలో రెండు రోజులుగా శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం శ్రీకృష్ణుడి ప్రతిమతో పరమేశ్వర థియేటర్ రోడ్డు, గంజి, మెయిన్‌రోడ్డు, కాలేజ్‌రోడ్డులోని పురవీధులుగా మీదుగా స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో భాగంగా కోలాట నృత్యాలు, భగవద్గీత శ్లోక ఉచ్చరణలతో, భక్తిశ్రద్ధలతో పల్లకీసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా సద్గుణ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ చెడు వ్యసనాలను వదిలిపెట్టి సన్మార్గంలో నడుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అరుంధతి, కుల్దీప్‌రెడ్డి, ధన్వంతరి, సుధీర్, దినేష్, శిరీష, వాసంతి, సాత్విక, నవ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఈ నెల 19న వికారాబాద్‌కు రానున్నారని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు రమేష్‌కుమార్, శివరాజు, వడ్లనందు తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ.. బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ఇక్కడికి రానున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మన్నెగూడ రోడ్‌లో, వికారాబాద్‌లో శివారెడ్డి పేట వద్ద కమలనాథులు ఘన స్వాగతం పలికి, ర్యాలీగా వస్తారని చెప్పారు. అనంతరం ఎన్నెపల్లి చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారని తెలిపారు. అక్కడి నుంచి అనంతపద్మనాభ స్వామి దర్శనానికి వెళ్తారన్నారు. పార్టీ నాయకులు కేపీ రాజు, విజయభాస్కర్‌రెడ్డి, కృష్ణ, రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

లక్ష గాంధీ విగ్రహాల ప్రదర్శన పోస్టర్ ఆవిష్కరణ