
దూసుకొచ్చిన మృత్యువు
అబ్దుల్లాపూర్‌మెట్: నిలబడి ఉన్న వ్యక్తిని వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన ఓ లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా వైరా మండలం నెమలి గ్రామానికి చెందిన కమ్మపాటి కృపారక్షణ (32) కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి హైదరాబాద్ జీడిమెట్ల నుంచి ఆంఽధ్రప్రదేశ్ రాష్ట్రం నూజివీడుకు ఆర్టీసీ బస్సులో వెళ్తున్నాడు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న బస్సు అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం ఽశివారులోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలోకి రాగానే టైరు పంక్చర్ అయ్యింది. దీంతో బస్సు డ్రైవర్ టైరును పంక్చర్ చేయిస్తుండగా కృపారక్షణ పక్కన నిల్చుని ఉన్నాడు. అదే సమయంలో హైదరాబాద్ వైపు అతివేగంగా వచ్చిన ఓ లారీ అతన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కృపారక్షణకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురికీ తరలించారు.
● ఆగి ఉన్న వ్యక్తిని ఢీకొన్న లారీ
● అక్కడికక్కడే దుర్మరణం