
మత్తు పదార్థాలకు బానిస కావొద్దు
కందుకూరు: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీఐ సీతారామ్ సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని సరస్వతిగూడలో ఎస్‌ఐలు పరమేష్, మహేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కంబాలపల్లి విష్ణువర్ధన్‌రెడ్డితో కలిసి డ్రగ్స్, మద్యంపై యువతకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మద్యం, గంజాయి, డ్రగ్స్ మత్తులో నేటి యువత చిత్తవుతుందన్నారు. విచక్షణ కోల్పోయి సైకోలుగా ప్రవర్తిస్తున్నారన్నారు. వీటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. యువత గంజాయి, డ్రగ్స్ లాంటి మాదకద్రవ్యాలు తీసుకున్నట్లు తమ దృష్టికి వస్తే శాఖాపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం అందరితో డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌ముదిరాజ్, యాదయ్య, రాము, మహేందర్, వినోద్, వంశీ, మల్లేష్, మహేందర్, జంగారెడ్డి, వెంకట్‌రెడ్డి, అంజయ్య, కుమార్, యాదయ్య, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
కందుకూరు సీఐ సీతారామ్