
సమస్యలు పరిష్కరించాలి
ఇబ్రహీంపట్నం: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.రమ డిమాండ్ చేశారు. అక్టోబర్ 26, 27 తేదీల్లో ఇబ్రహీంపట్నంలో నిర్వహించే ఆ సంఘం 4వ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం ఏర్పాటు సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికుల శ్రమను ప్రభుత్వం గుర్తించడం లేదని, పని భద్రత కరువైందన్నారు. 25 ఏళ్లుగా పనిచేస్తున్నా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు నోచుకోవడం లేదన్నారు. కేవలం రూ.3 వేల వేతనం నెలకు ఇస్తే కుటుంబం ఎలా గడుస్తుందన్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఆహ్వాన సంఘం ఏర్పాటు
మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన్‌గా పి.యాదయ్య, వైస్ చైర్మన్‌గా చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శిగా స్వప్న, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా అలివేల, కార్యదర్శిగా పద్మ, కోశాధికారి నవనీతతోపాటు సభ్యులుగా రాజు, కవిత, బ్రహ్మయ్య, సామేల్, ఉమా, గణేశ్, కిషన్, ఎల్లేశ్, బుగ్గరాములు, కృష్ణ, నర్సింహ, చందునాయక్, పాండు తదితరులను ఎన్నుకున్నారు.
మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమ